రైతు ఆత్మహత్యలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
రైతుల ఆత్మహత్యలపై ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2014-19లో ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు పరిహారం ఇవ్వాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. ఆ ఐదేళ్లలో 1,513మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయని.. కానీ గత ప్రభుత్వం 391మందికే పరిహారం చెల్లించిందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం చనిపోయిన రైతులను గుర్తించాలని ఆయన కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల ఇళ్లకు కలెక్టర్లు వెళ్లి.. రూ.7లక్షల ఆర్థికసాయం చేయాలని ఆయన పేర్కొన్నారు. […]
రైతుల ఆత్మహత్యలపై ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2014-19లో ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు పరిహారం ఇవ్వాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. ఆ ఐదేళ్లలో 1,513మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయని.. కానీ గత ప్రభుత్వం 391మందికే పరిహారం చెల్లించిందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం చనిపోయిన రైతులను గుర్తించాలని ఆయన కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల ఇళ్లకు కలెక్టర్లు వెళ్లి.. రూ.7లక్షల ఆర్థికసాయం చేయాలని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలను కూడా భాగస్వాములు చేయాలని జగన్ సూచించారు. దీని కోసం ఓ కొత్త పథకాన్ని తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు.