రేపటినుంచే ఏపీ బడ్జెట్ సెషన్..! బీఏసీ భేటీ
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇవాళ ఉదయం అసెంబ్లీలో బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్) భేటీ కానుంది. సీఎం జగన్ పాల్గొననున్న ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, బడ్జెట్ సమావేశాల్లో చర్చించే అంశాలపై బీఏసీ నిర్ణయం తీసుకోనుంది. రేపు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దాదాపు 14 రోజులు బడ్జెట్‌పై అసెంబ్లీలో చర్చ కొనసాగే అవకాశముంది. గత బడ్జెట్ సమావేశాల కంటే ఒక […]
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇవాళ ఉదయం అసెంబ్లీలో బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్) భేటీ కానుంది. సీఎం జగన్ పాల్గొననున్న ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, బడ్జెట్ సమావేశాల్లో చర్చించే అంశాలపై బీఏసీ నిర్ణయం తీసుకోనుంది. రేపు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దాదాపు 14 రోజులు బడ్జెట్‌పై అసెంబ్లీలో చర్చ కొనసాగే అవకాశముంది. గత బడ్జెట్ సమావేశాల కంటే ఒక రోజు ముందుగానే బీఏసీ భేటీ అవుతోంది. ఈ నెల 12న సభలో బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ ప్రవేశపెట్టనున్నారు.