బ్రేకింగ్: ఏపీ కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా జక్కంపూడి రాజా

ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా జక్కంపూడి రాజా ఎంపికయ్యారు. ఈ మేరకు సీఎం జగన్‌ ఆయనను ఎంపిక చేశారు. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు రానున్నాయి. కాగా వైఎస్‌ఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన జక్కంపూడి రామ్మెహన్ తనయుడే జక్కంపూడి రాజా. ఈ ఎన్నికల్లో రాజానగరం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన రాజా ఎమ్మెల్యేగా గెలుపొందారు. జగన్ కేబినెట్‌లో ఆయనకు స్థానం వస్తుందని అప్పట్లో కొన్ని ఊహాగానాలు వినిపించాయి. అయితే కొన్ని కారణాల వలన కేబినెట్‌లో […]

బ్రేకింగ్: ఏపీ కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా జక్కంపూడి రాజా

Edited By:

Updated on: Jul 19, 2019 | 5:18 PM

ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా జక్కంపూడి రాజా ఎంపికయ్యారు. ఈ మేరకు సీఎం జగన్‌ ఆయనను ఎంపిక చేశారు. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు రానున్నాయి. కాగా వైఎస్‌ఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన జక్కంపూడి రామ్మెహన్ తనయుడే జక్కంపూడి రాజా. ఈ ఎన్నికల్లో రాజానగరం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన రాజా ఎమ్మెల్యేగా గెలుపొందారు. జగన్ కేబినెట్‌లో ఆయనకు స్థానం వస్తుందని అప్పట్లో కొన్ని ఊహాగానాలు వినిపించాయి. అయితే కొన్ని కారణాల వలన కేబినెట్‌లో రాజాకు స్థానాన్ని కల్పించని వైఎస్ జగన్.. ఇప్పుడు ఆయనను కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించారు.