ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. ఆయన చేసిన పనిని ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు. నవంబర్ 1న వైఎస్ఆర్ జీవన సాఫల్య పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ పురస్కారాల ప్రదానోత్సవంలో జగన్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహోన్నత వ్యక్తులు, సంస్థలకు వైఎస్ఆర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులను ప్రదానం చేస్తారు. ప్రముఖ దళిత సామాజిక వేత్త, కవి కాత్తి పద్మారావుకు ఈ పురస్కారం ప్రకటించారు.
పురస్కారం అందుకోవడానికి కాత్తి పద్మారావు వీల్ చైర్‌పై స్టేజిపైకి వచ్చారు. అవార్డు ప్రదానం తర్వాత ఆయన వీల్ చైర్ కదలకపోవడంతో ఇబ్బంది పడ్డారు. గమనించిన సీఎం జగన్ వీల్ చైర్ పెడల్స్‌ను స్వయంగా సరిచేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మామూలు వ్యక్తిలా సాయం చేయడాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు.
CM @ysjagan, presented the YSR Life Time Achievement Award for the Dalit Poet Katthi Padma Rao. Saw the improper leg rest and adjusted his it without any hesitation#YSRAwards pic.twitter.com/IwoAnQB6x0
— YS Jagan Trends™ (@YSJaganTrends) November 1, 2021
Read Also.. CM Jagan: బద్వేల్ గెలుపు ప్రజాప్రభుత్వానికి, సుపరిపాలనకు ప్రజలు ఇచ్చిన దీవెనలుగా భావిస్తున్నా అన్న సీఎం జగన్
విద్యాకానుక’పై సీఎం జగన్ కీలక ఆదేశాలు.. విద్యార్ధులకు ఇచ్చేవి ఇవే.. ఖర్చు ఎంతంటే.!