అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్

‌ సీఎం వాహనశ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు.

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్

Updated on: Sep 02, 2020 | 3:32 PM

‌ సీఎం వాహనశ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది. సీఎం కాన్వాయ్ అయినప్పటికీ..సామాన్య ప్రజలకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో సీఎం జగన్ తన కాన్వాయ్‌ను పక్కకు జరిపి..అంబులెన్స్ కు దారి ఇవ్వటం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.