పిల్లలకు బాసట మీరే: పేరెంట్స్‌కు బాబు సలహా

ఇంటర్ ఫలితాల అవకతవకల కారణంగా కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు పిల్లల తల్లిదండ్రులను ఉద్దేశించి ఓ ప్రకటన చేశారు. ‘‘విద్యార్థుల తల్లిదండ్రులకు నా వినతి. రేపు విడుదల కానున్న ఆంధ్రప్రదేశ్ పదోతరగతి పరీక్షా ఫలితాల్లో మీ పిల్లల ఫలితాలు ఎలా ఉన్నా మీ అండ వారికి ఎంతో అవసరం. వారిని నిందించడం, ఇతర పిల్లలతో పోల్చి మాట్లాడటం చేయకండి. వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీయకండి. పిల్లలకు ధైర్యం చెప్పండి. ఈ ఫలితాలు తెలివి […]

పిల్లలకు బాసట మీరే: పేరెంట్స్‌కు బాబు సలహా
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 13, 2019 | 4:08 PM

ఇంటర్ ఫలితాల అవకతవకల కారణంగా కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు పిల్లల తల్లిదండ్రులను ఉద్దేశించి ఓ ప్రకటన చేశారు.

‘‘విద్యార్థుల తల్లిదండ్రులకు నా వినతి. రేపు విడుదల కానున్న ఆంధ్రప్రదేశ్ పదోతరగతి పరీక్షా ఫలితాల్లో మీ పిల్లల ఫలితాలు ఎలా ఉన్నా మీ అండ వారికి ఎంతో అవసరం. వారిని నిందించడం, ఇతర పిల్లలతో పోల్చి మాట్లాడటం చేయకండి. వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీయకండి. పిల్లలకు ధైర్యం చెప్పండి. ఈ ఫలితాలు తెలివి తేటలకు కొలమానాలు కాదని, కింద పడినా రివ్వున పైకి లేచే కెరటాల్లా రెట్టించిన ఉత్సాహంతో అద్బుత ఫలితాలను సాధించవచ్చని వారిలో ప్రేరణ కలిగించండి’’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.