చంద్రబాబు సంచలన నిర్ణయం

| Edited By:

Apr 05, 2019 | 10:57 AM

ఎన్నికల ప్రచారం మరో నాలుగు రోజుల్లో ముగియనుండగా.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర అంబేద్కర్ విగ్రహం ఎదుట చంద్రబాబు ధర్నా చేయబోతున్నారు. గత కొద్ది రోజులుగా ఏపీలో టీడీపీ నేతల ఆస్తులపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. టీడీపీ అభ్యర్థులు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్, నారాయణ విద్యాసంస్థలు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ నివాసం తదితర ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. వీటిని వ్యతిరేకిస్తూ […]

చంద్రబాబు సంచలన నిర్ణయం
Follow us on

ఎన్నికల ప్రచారం మరో నాలుగు రోజుల్లో ముగియనుండగా.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర అంబేద్కర్ విగ్రహం ఎదుట చంద్రబాబు ధర్నా చేయబోతున్నారు. గత కొద్ది రోజులుగా ఏపీలో టీడీపీ నేతల ఆస్తులపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. టీడీపీ అభ్యర్థులు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్, నారాయణ విద్యాసంస్థలు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ నివాసం తదితర ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. వీటిని వ్యతిరేకిస్తూ నిరసనకు దిగాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అన్ని నియోజకవర్గాల్లోని అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన చేయాలని ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.