పవన్‌కు మొదటి షాక్.. తేల్చి చెప్పేసిన బీజేపీ నేత

| Edited By:

Oct 31, 2019 | 8:30 AM

ఏపీలో ఇసుక కొరతపై జనసేన పోరాటానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నవంబర్ 3న విశాఖలో లాంగ్ మార్చ్ పేరుతో భారీ ఆందోళన కార్యక్రమానికి జనసేన అధినేత పిలుపునిచ్చారు. ఈ విషయంపై ప్రతిపక్షాలన్నింటిని ఏక తాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న పవన్.. అందరికీ ఆయనే స్వయంగా ఫోన్లు చేస్తున్నారు. ఇక దీనిపై అన్ని పార్టీల నేతలు సానుకూలంగా ఉన్నట్లు జనసేన చెబుతోంది. అయితే ఈ విషయంలో పవన్‌కు మొదటి షాక్ తగిలింది. పవన్ సభలో పాల్గొనాల్సిన అవసరం […]

పవన్‌కు మొదటి షాక్.. తేల్చి చెప్పేసిన బీజేపీ నేత
Follow us on

ఏపీలో ఇసుక కొరతపై జనసేన పోరాటానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నవంబర్ 3న విశాఖలో లాంగ్ మార్చ్ పేరుతో భారీ ఆందోళన కార్యక్రమానికి జనసేన అధినేత పిలుపునిచ్చారు. ఈ విషయంపై ప్రతిపక్షాలన్నింటిని ఏక తాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న పవన్.. అందరికీ ఆయనే స్వయంగా ఫోన్లు చేస్తున్నారు. ఇక దీనిపై అన్ని పార్టీల నేతలు సానుకూలంగా ఉన్నట్లు జనసేన చెబుతోంది. అయితే ఈ విషయంలో పవన్‌కు మొదటి షాక్ తగిలింది. పవన్ సభలో పాల్గొనాల్సిన అవసరం బీజేపీకి లేదని ఆ పార్టీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి తేల్చి చెప్పారు.

ఈ మేరకు తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసిన విష్ణు వర్ధన్ రెడ్డి.. ‘‘ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ గారు పవన్ సభలో పాల్గొనాల్సిన అవసరం బీజేపీకి లేదు. ఇసుక సమస్యపై మొదటి నుంచి పోరాడుతోంది బీజేపీ. ముఖ్యమంత్రికి లేఖ రాసింది మొదట బీజేపీనే. ఇసుక సమస్యపై గవర్నర్‌ను కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చింది బీజేపీ’’ అని స్పష్టం చేశారు.

https://twitter.com/VishnuReddyBJP/status/1189545164454297601

ఆ తరువాత బీజేపీ ఆధ్వర్యంలో నవంబర్ 4న విజయవాడలో కన్నా గారి అధ్యక్షతన పెద్ద ఎత్తున మరోసారి ఆందోళన చేపడతామని ఆయన వివరించారు. అంతటితో ఆగకుండా భవన నిర్మాణ కార్మికుల కొరకు భిక్షాటన కార్యక్రమం చేసింది బీజేపీ. సమస్యకు సంఘీభావం తెలుపుతున్నామే తప్ప వేరే పార్టీలకు సంఘీభావం కాదు అంటూ విష్ణు వర్ధన్ రెడ్డి వివరించారు. మరి దీనిపై జనసేన ఎలా స్పందిస్తుందో చూడాలి.