జగన్‌పై డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి టిక్‌టాక్.. వీడియో వైరల్

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి చేసిన టిక్‌టాక్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ‘రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న’ అనే పాటకు పుష్ప శ్రీవాణి టిక్‌టాక్ వీడియో చేశారు. ఈ వీడియో ద్వారా తనలో ఉన్న మరో కళను ఆమె బయటపెట్టారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. జగన్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. దీంతో వారు ఈ వీడియోకు లైక్‌లు కొట్టడంతో […]

జగన్‌పై డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి టిక్‌టాక్.. వీడియో వైరల్

Edited By:

Updated on: Dec 31, 2019 | 7:39 PM

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి చేసిన టిక్‌టాక్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ‘రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న’ అనే పాటకు పుష్ప శ్రీవాణి టిక్‌టాక్ వీడియో చేశారు. ఈ వీడియో ద్వారా తనలో ఉన్న మరో కళను ఆమె బయటపెట్టారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. జగన్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. దీంతో వారు ఈ వీడియోకు లైక్‌లు కొట్టడంతో పాటు షేర్ చేస్తున్నారు.

కాగా పరిపాలనలో ఎప్పుడూ బిజీగా ఉండే పుష్పశ్రీవాణి అప్పుడప్పుడు తనలోని కళలను కూడా బయటపెడుతుంటారు. ఎన్నికల ప్రచారంలోనూ డ్యాన్స్‌తో ఆకట్టుకున్న పుష్ప.. అధికారంలోకి వచ్చిన తరువాత ఓ కార్యక్రమంలో గిరిజనులతో స్టెప్పులు వేశారు. అలాగే ఓ సినిమాలో అతిథి పాత్రలోనూ ఈ మంత్రి గారు నటించారు.