Rythu Bharosa Third phase : కరోనా కష్టకాలంలో కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం రైతులకు పెట్టుబడి సాయం అందించారన్నారు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత. మూడో విడత రైతు భరోసా కింద రైతులందరికీ డబ్బులు విడుదల చేశారని ఆమె చెప్పారు. రాష్ట్రంలో 52 లక్షలమంది రైతులు ఇవాళ మరోసారి రైతు భరోసా కింద లబ్ది పొందారని ఆమె గుంటూరులో వెల్లడించారు. గుంటూరు జిల్లాలో 4 లక్షల 65 వేల మంది రైతులకు పెట్టుబడి సాయం అందిందని ఆమె తెలిపారు. దివంగత మహానేత వై.ఎస్. రాజశేఖరరెడ్డి, ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి లు రైతుల సంక్షేమం కోరుకునేవారని ఆమె పేర్కొన్నారు. యానాంలో నివశిస్తూ మన రాష్ట్రంలో భూములున్న రైతులకు కూడా రైతుభరోసా విడుదల చేశామని ఆమె చెప్పారు. కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలన్న హోంమంత్రి.. కర్ప్యూ సమయంలో ఎవరూ అకారణంగా ఇంట్లోనుంచి బయటకురావద్దని సూచించారు. అందరూ కరోనా మార్గదర్శకాలు పాటించండి, పోలీసులకు సహకరించండి.. అని హోం మంత్రి ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు.
Read also : Rahul Gandhi : ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేతల విసుర్లు.. కరోనా మందులతోపాటు మోదీ కూడా కనిపించడంలేదన్న రాహుల్