చెట్లతో చెలిమి.. వనమహోత్సవానికి కదిలిన సీఎం జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా మేడికొండూరులో నిర్వహించిన 70వ వనమహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వనహోత్సవంలో భాగంగా సీఎం జగన్ స్వయంగా విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలను ఆయన ప్రారంభించారు. రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, పేర్ని నాని, మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణతో పాటు గుంటూరు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం […]

చెట్లతో చెలిమి.. వనమహోత్సవానికి కదిలిన సీఎం జగన్

Edited By: Nikhil

Updated on: Aug 31, 2019 | 3:04 PM

ఏపీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా మేడికొండూరులో నిర్వహించిన 70వ వనమహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వనహోత్సవంలో భాగంగా సీఎం జగన్ స్వయంగా విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలను ఆయన ప్రారంభించారు. రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, పేర్ని నాని, మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణతో పాటు గుంటూరు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం సీఎం జగన్ నేరుగా తాడేపల్లికి చేరుకుంటారు.