AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆయన 17 భాషలు అనర్గళంగా మాట్లాడేవారు.. ఇప్పుడు కొందరు హిందీ ఎందుకంటున్నారు- సీఎం చంద్రబాబు

దేశానికి అనేక రంగాల్లో సేవలందించిన మహానీయుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో ఆయన సేవలు మరవలేనివన్నారు. 17 భాషలు నేర్చుకున్న పీవీ.. ఎన్నో చారిత్రాత్మక ఆర్థిక సంస్కరణలను తీసుకువచ్చారన్నారు. ప్రధానిగా, కేంద్రమంత్రిగా, సీఎంగా ఆయన దేశానికి ఎన్నో సేవలందించారని గుర్తుచేశారు. ఢిల్లీ జరిగిన లెక్చర్‌ సిరీస్‌ ఆరో ఎడిషన్‌ కార్యక్రంలో లైఫ్‌ అండ్‌ లెగసీ ఆఫ్‌ పీవీ అంశంపై మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆయన 17 భాషలు అనర్గళంగా మాట్లాడేవారు.. ఇప్పుడు కొందరు హిందీ ఎందుకంటున్నారు- సీఎం చంద్రబాబు
Cm Chandrababu
Anand T
|

Updated on: Jul 15, 2025 | 7:07 PM

Share

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ ప్రధాన మంత్రుల సందర్శన శాల,(తీన్ మూర్తి భవన్)లో ఏర్పాటు చేసిన దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు సంస్మరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా “ది లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పివి నరసింహారావు” అనే అంశంపై సీఎం చంద్రబాబు ప్రసంగించారు. దేశానికి అనేక రంగాల్లో సేవలందించిన మహానీయుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో ఆయన సేవలు మరవలేనివని తెలిపారు. ఆర్థిక సంస్కరణలు అనగానే గుర్తొచ్చే మొదటి పేరు ఆయనదేనని సీఎం తెలిపారు. దేశం ఎదుర్కొనే సామాజిక ,రాజకీయ ఆర్థిక సవాళ్లను తెలిసిన నేతల్లో పీవీ ఒకరని సీఎం అన్నారు.

1991 నాటికి భారత్ తీవ్రమైన ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. సరైన విధానాలు లేక భారత ఆర్థిక వ్యవస్థ ఆస్తవ్యస్తంగా ఉండేది. ఆ సమయంలో చారిత్రాత్మక ఆర్థిక సంస్కరణలను తీసుకువచ్చిన పీపీ దేశాన్ని అభివృద్ది బాటలో నడిపించారని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. పీవీ నరసింహారావు తీసుకున్న చర్యలతోనే దేశంలో ఐటీ విప్లవం పుట్టుకొచ్చిందని సీఎం తెలిపారు. ఆయన తీసుకు వచ్చిన ఆర్థిక సంస్కరణల ఫలాలను ఇప్పుడు పొందుతున్నామన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలు ఎవరు మర్చిపోలేదుని చంద్రబాబు తెలిపారు. నాడు పివి 17 భాషల్లో అనర్గలంగా మాట్లాడేవారు.. కానీ ఇప్పడు కొందరు హిందీ నేర్చుకోవడం ఎందుకు అంటున్నారని చంద్రబాబు అన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.