ధన్యవాద తీర్మానంపై ఏపీ అసెంబ్లీలో చర్చ

|

Jun 17, 2019 | 10:44 AM

అమరావతి : ఏపీ శాసనసభ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఈ తీర్మానాన్ని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదోర ప్రవేశపెట్టగా..ప్రభుత్వ విప్‌ ముత్యాలనాయుడు బలపరిచారు. కాగా ప్రభుత్వం ఏర్పాటయ్యాక శాసనసభ సమావేశాల తొలిరోజు స్పీకర్ ఎన్నిక సందర్భంగా అధికార, విపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. స్పీకర్‌ను ఎన్నుకుని ఛైర్ వద్దకు తీసుకెళ్లే సమయంలో ప్రతిపక్షనేత చంద్రబాబు సాంప్రదాయాన్ని పాటించలేదంటూ వైసీపీ ఆరోపించగా..కనీసం తమకు సమాచారం అందించలేదని […]

ధన్యవాద తీర్మానంపై ఏపీ అసెంబ్లీలో చర్చ
Follow us on

అమరావతి : ఏపీ శాసనసభ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఈ తీర్మానాన్ని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదోర ప్రవేశపెట్టగా..ప్రభుత్వ విప్‌ ముత్యాలనాయుడు బలపరిచారు.

కాగా ప్రభుత్వం ఏర్పాటయ్యాక శాసనసభ సమావేశాల తొలిరోజు స్పీకర్ ఎన్నిక సందర్భంగా అధికార, విపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. స్పీకర్‌ను ఎన్నుకుని ఛైర్ వద్దకు తీసుకెళ్లే సమయంలో ప్రతిపక్షనేత చంద్రబాబు సాంప్రదాయాన్ని పాటించలేదంటూ వైసీపీ ఆరోపించగా..కనీసం తమకు సమాచారం అందించలేదని టీడీపీ ప్రతివిమర్శ చేసింది.