డేరింగ్ సీఎం జగన్ బంగీ జంప్ చూశారా?

ఏపీ సీఎం జగన్ డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్. ఒకప్పుడు సాధారణ నేత కొడుకైనా, తదుపరి  సీఎం తనయుడిగా ఉన్నా, ప్రతిపక్ష నేతగా మారినా,  ప్రస్తుతం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా భాద్యతలు నిర్వర్తిస్తున్నా ఆయన స్టైల్ వేరు. మైండ్‌లో అనిపిస్తే బ్లైండ్‌గా దూసుకెళ్లడం జగన్‌కి అలవాటు. తను అనుకుంది చెప్పడం, చెప్పింది తూ.చ తప్పకుండా పాటించడం సీఎం స్టైయిల్. ఇది ఆయన తండ్రి అయిన దివంగత సీఎం వైఎస్సార్ నుంచి జగన్‌కి వచ్చిన వారసత్వం. ఈ ఇద్దరి […]

డేరింగ్ సీఎం జగన్ బంగీ జంప్ చూశారా?
Follow us

|

Updated on: Jul 27, 2019 | 6:16 PM

ఏపీ సీఎం జగన్ డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్. ఒకప్పుడు సాధారణ నేత కొడుకైనా, తదుపరి  సీఎం తనయుడిగా ఉన్నా, ప్రతిపక్ష నేతగా మారినా,  ప్రస్తుతం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా భాద్యతలు నిర్వర్తిస్తున్నా ఆయన స్టైల్ వేరు. మైండ్‌లో అనిపిస్తే బ్లైండ్‌గా దూసుకెళ్లడం జగన్‌కి అలవాటు. తను అనుకుంది చెప్పడం, చెప్పింది తూ.చ తప్పకుండా పాటించడం సీఎం స్టైయిల్. ఇది ఆయన తండ్రి అయిన దివంగత సీఎం వైఎస్సార్ నుంచి జగన్‌కి వచ్చిన వారసత్వం. ఈ ఇద్దరి నాయకుల ప్రసంగాల్లో సహజంగానే వినిపించే..మాట తప్పం, మడమ తిప్పం అనే  వాక్యం లాగే వారి ధోరణి కూడా ఉంటుంది.  సహజంగానే సీమ మనిషి అవ్వడం..చిన్నప్పటి నుంచి పెరిగిన వ్యక్తిత్వం జగన్‌కి ఒక సపరేట్ స్టైయిల్‌ని తెచ్చాయి. తన తండ్రి కోసం చనిపోయినవాళ్లని పరామర్శించడానికి కేంద్రలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న అప్పటి కాంగ్రెస్ పార్టీని ధిక్కరించినా,  నిర్వీరామంగా సుదీర్ఘ పాదయాత్ర చేసినా, కొత్త పార్టీ స్థాపించినా, రాజకీయాల్లోకి అడుగుపెట్టిన  కొద్ది టైంలోనే బంపర్ మెజార్టీతో అధికారం వచ్చినా అవి జగన్ మైండ్ సెట్‌కి ఉదాహరణలే.  ఇవి కేవలం రాజకీయ నిర్ణయాల్లో కాదు..వ్యక్తిగతంగా కూడా జగన్‌కు అప్లై అవుతోంది.

ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో  వైయస్ జగన్మోహన్ రెడ్డి తన న్యూజిలాండ్ పర్యటనలో పెద్ద సాహసమే చేశారు. బంగీ జంప్‌లకు పేరెన్నిక గల కవెరో బ్రిడ్జి నుంచి ఆయన  జంప్ చేశారు.  పాదయాత్రకు ప్రారంభానికి ముందు తన కుటుంబంతో కలిసి సరదాగా న్యూజిలాండ్ వెళ్లిన జగన్.. అక్కడి కవెరో బ్రిడ్జి పై నుంచి ఈ సాహసం కృత్యం ప్రదర్శించారు. ఆ తర్వాత చాలాకాలానికి బంగీ జంప్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రస్తుత ఏపీ సీఎం జగన్ సాహోసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్న సమయాన.. పాత వీడియో మీ కోసం.