TDP: నెల్లూరులో కూటమి క్లిన్ స్వీప్.. 30 ఏళ్ల తర్వాత సక్సెస్ వెనుక నారాయణ మంత్రం అదేనా..

| Edited By: Srikar T

Jun 07, 2024 | 9:55 AM

30 ఏళ్ల తర్వాత విక్టరీ కొట్టిన తెలుగుదేశం పార్టీ. గత ఆరు పర్యాయాలు ఈ పార్టీకి విజయం దూరమైన ఇప్పుడు నియోజకవర్గంలో విజయం దక్కింది. అది కూడా బంపర్ మెజారిటీ సాధించింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత రెండే సార్లు గెలిచినా అక్కడ ఈ సారి గెలుపుకు కారణం నారాయణ మంత్రం. నారాయణ మంత్రంతో గెలుపేమిటి అనుకుంటున్నారా.. అవును అదే జరిగింది అక్కడ. నెల్లూరు జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్.. ఆ తర్వాత వైసీపీకి కంచుకోట. అలాంటి కంచుకోట గోడలు బద్దలయ్యాయి. ఆ కోటపై ఇప్పుడు టీడీపీ జెండా ఎగిరింది.

TDP: నెల్లూరులో కూటమి క్లిన్ స్వీప్.. 30 ఏళ్ల తర్వాత సక్సెస్ వెనుక నారాయణ మంత్రం అదేనా..
TDP
Follow us on

30 ఏళ్ల తర్వాత విక్టరీ కొట్టిన తెలుగుదేశం పార్టీ. గత ఆరు పర్యాయాలు ఈ పార్టీకి విజయం దూరమైన ఇప్పుడు నియోజకవర్గంలో విజయం దక్కింది. అది కూడా బంపర్ మెజారిటీ సాధించింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత రెండే సార్లు గెలిచినా అక్కడ ఈ సారి గెలుపుకు కారణం నారాయణ మంత్రం. నారాయణ మంత్రంతో గెలుపేమిటి అనుకుంటున్నారా.. అవును అదే జరిగింది అక్కడ.
నెల్లూరు జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్.. ఆ తర్వాత వైసీపీకి కంచుకోట. అలాంటి కంచుకోట గోడలు బద్దలయ్యాయి. ఆ కోటపై ఇప్పుడు టీడీపీ జెండా ఎగిరింది. నెల్లూరు జిల్లాలోని నెల్లూరు సిటి నియోజకవర్గం టీడీపీకి కలిసిరానిదిగా మిగిలింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత రెండంటే రెండే సార్లు అక్కడ ఆపార్టీ గెలవగలిగింది. 1983, 1994 లో అక్కడ టీడీపీ గెలిచింది. అంతకుముందు, ఆ తర్వాత కాంగ్రెస్ మాత్రమే గెలుచుకుంటూ వస్తోంది. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ ఖాతాలోకి నెల్లూరు సిటి వెళ్ళింది. 1994 తర్వాత ఒక్కసారి కూడా టీడీపీ గెలవలేక పోయింది. ఆరు పర్యాయాలు.. అంటే ముప్పై ఏళ్లుగా ఆ నియోజకవర్గంలో ఎంత పోరాడిన గెలుపు మాత్రం దక్కలేదు.

అలాంటి చోట ఈ ఎన్నికల్లో టిడిపి జెండా ఎగిరింది. అదికూడా వైసిపి సామాజిక సమీకరణ అస్త్రాన్ని ప్రయోగించినా అనూహ్య విజయం సాధించింది టీడీపీ. 70,542 ఓట్ల బంపర్ మెజారిటీతో మాజీమంత్రి పొంగూరు నారాయణ గెలిచారు. మైనారిటీ ఓట్లు అధికంగా ఉన్న ఇక్కడ వైసిపి డిప్యూటీ మేయర్ ఖలీల్‎ను రంగంలోకి దించినా మైనారిటీ ఓటర్లు సైతం మెజారిటీగా నారాయణ వైపు నిలిచారు. గెలుపే దక్కని నియోజకవర్గంలో నారాయణ ఇంత మెజారిటీతో గెలవడం ఇక్కడ డబుల్ రికార్డ్. 2014లో ఎమ్మెల్సీగా, మంత్రిగా పనిచేసిన నారాయణ నెల్లూరు సిటీలో భారీగా నిధులు తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో గెలుపు దాకా వెళ్లి తక్కువ ఓట్లతో మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేతిలో ఓటమి పాలయ్యారు. మళ్లీ ఇక్కడి నుంచే పోటీ చేశారు నారాయణ. గతంలో చేసిన అభివృద్ధి, ఓడారన్న సెంటిమెంట్, ప్రభుత్వ వ్యతిరేకత అన్ని కలిసి భారీ మెజారిటీతో గెలిచారు. ఇక తన కోసం కష్టపడ్డ క్యాడర్‎కు నారాయణ కృతజ్ఙతలు తెలిపారు. తనకోసం పని చేసిన క్యాడర్‎కు ఏడాదికి రూ.10 కోట్లతో వారి కుటుంబ క్షేమం, విద్య, వైద్యం కోసం ఖర్చు చేస్తానని ప్రకటించారు. జీవితకాలం తన క్యాడర్‎కు ఈ సాయం అందేలా.. తన తర్వాత కూడా కుటుంబ సభ్యులు దీన్ని కొనసాగించేలా ఏర్పాట్లు చేశారు. మొత్తానికి గెలుపే దక్కని చోట గెలవడం.. భారీ మెజారిటీ దక్కడం, కార్యకర్తల సంక్షేమం ఇలా అన్నింట్లో నారాయణ రికార్డు సాధించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..