Andhra Pradesh: వైసీపీ కంచుకోటలో చరిత్ర తిరగరాసిన మాగుంట.. ఎట్టకేలకు ఎగిరిన టీడీపీ జెండా

తెలుగుదేశం పార్టీకి ఒంగోలు పార్లమెంట్ స్థానం కొరకరాని కొయ్యగా ఉంటూ వచ్చింది. ఎంపిగా పోటీ చేయడానికి ఇక్కడ టిడిపి నుంచి అభ్యర్దులు ముందుకు రారట... ఇది ఈ ఒక్కసారికాదట... ప్రతిఎన్నికల్లో ఇదేతంతు నడుస్తుందట.. టీడీపీ ఆవిర్భావం నుంచి 2019 వరకు ఇక్కడ పదిసార్లు ఎన్నికలు జరిగితే కేవలం రెండుసార్లు మాత్రమే టీడీపీ గెలవడంతో ఇక్కడ టిడిపి...

Andhra Pradesh: వైసీపీ కంచుకోటలో చరిత్ర తిరగరాసిన మాగుంట.. ఎట్టకేలకు ఎగిరిన టీడీపీ జెండా
TDP
Follow us

| Edited By: Narender Vaitla

Updated on: Jun 08, 2024 | 9:44 PM

వైసిపి కంచుకోటలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి చరిత్ర తిరగరాశారు. పాతికేళ్ల తర్వాత ఒంగోలు పార్లమెంట్‌ స్థానంలో ఎట్టకేలకు టీడీపీ జెండా ఎగరవేశారు. వైసీపీ నుంచి టీడీపీలోకి మారినా సిట్టింగ్ స్థానం పదిలంగా ఉంది. ఇంతకీ వైసీపీ కంచుకోటలో పాతికేళ్ల తర్వాత టీడీపీ జెండా ఎలా ఎగిరింది.

తెలుగుదేశం పార్టీకి ఒంగోలు పార్లమెంట్ స్థానం కొరకరాని కొయ్యగా ఉంటూ వచ్చింది. ఎంపిగా పోటీ చేయడానికి ఇక్కడ టిడిపి నుంచి అభ్యర్దులు ముందుకు రారట… ఇది ఈ ఒక్కసారికాదట… ప్రతిఎన్నికల్లో ఇదేతంతు నడుస్తుందట.. టీడీపీ ఆవిర్భావం నుంచి 2019 వరకు ఇక్కడ పదిసార్లు ఎన్నికలు జరిగితే కేవలం రెండుసార్లు మాత్రమే టీడీపీ గెలవడంతో ఇక్కడ టిడిపి నుంచి పార్లమెంట్‌కు పోటీ చేస్తే అంతే సంగతులు అన్నట్టుగా మారిందట. ఒంగోలు ఎంపిగా పోటీ చేసేందుకు ముందునుంచి ఎవరూ ఆసక్తి చూపించకపోతుండటంతో అప్పటికప్పుడు ఎవరో ఒకరిని పట్టుకొచ్చి ఎన్నికల బరిలో దింపి బలిచేస్తారన్నది నానుడిగా మారిపోయిందట. అయితే ఈసారి ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసిన మాగుంట శ్రీనివాసులురెడ్డి పాతికేళ్ల తర్వాత చరిత్ర తిరగరాశారు. ఎట్టకేలకు టిడిపి జెండాను ఒంగోలు పార్లమెంట్‌లో ఎగరవేశారు.

ఒంగోలు పార్లమెంట్‌ స్థానం ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా ఉండేది. 1952లో ద్విసభ్య పార్లమెంట్‌ నియోజకవర్గంగా ఉన్న ఒంగోలు 1957 ఎన్నికల్లో ఏకసభ్య నియోజకవర్గంగా మారింది. 1952 నుంచి 2019 వరకు 17 సార్లు ఒంగోలు పార్లమెంట్ స్థానానికి ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌ పార్టీ 10 సార్లు, ఇండిపెండెంట్లు రెండుసార్లు… సీపీఐ ఒకసారి, రెండుసార్లు టిడిపి, రెండుసార్లు వైసిపి అభ్యర్దులు గెలుపొందారు. ఒంగోలు పార్లమెంట్‌ స్థానంలో అప్పట్లో కాంగ్రెస్‌ హవా అంతా ఇంతా కాదట. ఒంగోలు నియోజకవర్గానికి ఏమాత్రం సంబంధం లేని సినీనటుడు కొంగర జగ్గయ్య 1967లో ఒంగోలు నుంచి పార్లమెంట్‌కు కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేసి గెలుపొందడమే ఇందుకు నిదర్శంగా చెబుతారు. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇస్తేచాలు ఆయన ఎంపి అయిపోయినట్టే అనేలా ఉండేది అప్పట్లో కాంగ్రెస్‌ హవా.

మరోవైపు టిడిపి ఆవిర్బావం తరువాత 2019 వరకు పదిసార్లు ఎన్నికలు జరిగితే టిడిపి కేవలం రెండే రెండుసార్లు మాత్రమే గెలుపొందింది. 1984లో బెజవాడ పాపిరెడ్డి, 1999లో కరణం బలరాంలు టిడిపి పార్టీ నుంచి పోటీ చేసి ఎంపిలుగా గెలిచారు. 1999 తరువాత టిడిపి అభ్యర్ధులు ఒంగోలు నుంచి పార్లమెంట్‌కు వెళ్ళిందే లేదు. తెలుగు రాష్ట్రాల విభజనకు పూర్వం కాంగ్రెస్‌ , విభజన తరువాత వైసిపికి ఒంగోలు పార్లమెంట్‌ కంచుకోటగా మారింది… వైసిపి ఆవిర్భావం తరువాత 2014లో వైవి సుబ్బారెడ్డి, 2019 మాగుంట శ్రీనివాసులురెడ్డి వైసిపి అభ్యర్దులుగా వరుసగా గెలిచారు. ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉండటమే ఇందుకు కారణంగా భావిస్తారు.

టిడిపికి కలిసిరాని ఒంగోలు పార్లమెంట్‌ స్థానం…

ఒంగోలు పార్లమెంట్‌ స్థానం మొదటి నుంచి టిడిపికి కొరకరాని కొయ్యగానే ఉందట… టిడిపి ఆవిర్భావం తరువాత 1984లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ఒంగోలు నుంచి టిడిపి అభ్యర్ధిగా బెజవాడ పాపిరెడ్డి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత వరుసగా నాలుగుసార్లు టిడిపి పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయింది. పదిహేనేళ్ళ తరువాత 1999లో టిడిపి పార్టీ టికెట్‌పై కరణం బలరాం పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత 25 ఏళ్ళుగా టిడిపి ఇక్కడ గెలిచిందే లేదు. ఈ పాతికేళ్ల కాలంలో టిడిపి నుంచి ఒకసారి పోటీ చేసిన అభ్యర్ధి మరోసారి పోటీచేసేందుకు ముందుకు రావడం లేదట. దీంతో టిడిపికి ప్రతి పార్లమెంట్‌ ఎన్నికల్లో కొత్త అభ్యర్ధి కోసం వెతుకులాట తప్పనిసరిగా మారిందట. 2004 , 2009, 2014, 2019లో కొత్త వ్యక్తులే పోటీ చేస్తూ వచ్చారు, ఓడిపోయారు… నిన్నటి వరకు టిడిపి పార్టీకి ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలో ఒక నాయకుడంటూ ఎవరూ లేరట. నామ్‌కేవాస్తే పార్లమెంట్‌ ఇన్‌చార్జిలుగా కొంతమందిని నియమించినా పూర్తిస్థాయి నాయకుడు ఎవరూ ముందుకు రాలేదట. ఆ వచ్చే వాళ్లు కూడా గుర్రం ఎగరవచ్చు, అన్న ఆశతో తప్పితే గెలిచి ఉద్దరిస్తాం అన్న నమ్మకం మాత్రం ఉండదనేవారట.

రెడ్డి సామాజికవర్గం ప్రభావం… పాతుకు పోయిన మాగుంట కుటుంబం…

ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉన్నాయి. దీంతో ఇక్కడ పోటీ చేసే అభ్యర్ధులు ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ముందుకు వస్తారట. అందుకు అనుగుణంగానే కాంగ్రెస్‌, టిడిపి, వైసిపి పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకే ఎక్కువసార్లు టికెట్లు ఇచ్చారట. అందుకే ఇక్కడ 17 సార్లు పార్లమెంట్‌ ఎన్నికలు జరిగితే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 12 మంది అభ్యర్ధులు గెలిచారని విశ్లేషకులు లెక్కలు చెబుతారట. 1977లో ముప్పవరపు వెంకయ్యనాయుడు పోటీ చేసినా ఓటమి తప్పలేదట. 1977లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రస్తుత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు భారతీయ లోక్‌దళ్‌ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1,62,881 ఓట్లు సాధించి రెండోస్థానంలో నిలిచారు. కాంగ్రెస్‌ అభ్యర్ధి పులి వెంకటరెడ్డి చేతిలో 90 వేల ఓట్ల తేడాతో వెంకయ్య నాయుడు ఓడిపోయారు. ఈ పరిస్థితుల్లో ఒంగోలు పార్లమెంట్‌ నుంచి నెల్లూరు నుంచి వలసవచ్చిన మాగుంట సుబ్బరామిరెడ్డి 1991లో కాంగ్రెస్‌ నుంచి తొలిసారి పోటీ చేసి గెలుపొందారు. అప్పటి నుంచి మాగుంట కుటుంబం ఇక్కడ పాతుకుపోయిందట. ఆ తరువాత 1996, 1998, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి 2019 ఎన్నికల్లో వైసిపి నుంచి మాగుంట కుటుంబ సభ్యులు పోటీ చేసి గెలుపొందారు.

రెడ్డి సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండటంతో టిడిపి కూడా 1991,1996,1998, 2004, 2014 ఎన్నికల్లో రెడ్డి సామాజికవర్గానికి చెందిన అభ్యర్దులకే టికెట్లు ఇచ్చినా వర్కవుట్ కాలేదట. అప్పట్లో కాంగ్రెస్, ఇప్పట్లో వైసిపి పార్టీలకే ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం పట్టం కడుతూ వస్తోందట… దీంతో టిడిపికి ఒంగోలు పార్లమెంట్ స్థానం అందని ద్రాక్షలాగా మారిపోయిందట. మరి ఈసారి కూడా ఇంతేనా… అంటే మాగుంట రూపంలో టిడిపికి 2024 ఎన్నికల్లో కలిసి వచ్చిందట. వైసిపి సిట్టింగ్‌ ఎంపిగా ఉన్న మాగుంట ఆపార్టీ నుంచి తిరిగి టికెట్‌ ఆశించి భంగపడ్డారు. దీంతో ఈసారి టిడిపి నుంచి ఆయన బరిలో దిగారు. వైసిపి నుంచి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పోటీ చేశారు. అయితే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఒంగోలుకు కొత్త కావడంతో పాటు ఆయనకంటూ ప్రత్యేకంగా ఒక కేడర్‌ లేకపోవడం ఆయనకు మైనస్‌గా మారిందట. ఈ పరిస్థితుల్లో ఒంగోలు పార్లమెంట్‌ నుంచి ఈసారి వైసిపి సిట్టింగ్‌ ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి పోటీ చేయడంతో గత 30 ఏళ్లుగా మాగుంట కుటుంబానికి వ్యక్తిగతంగా ఉన్న అభిమానులు, టిడిపి కేడర్‌ తోడవడంతో ఈసారి టిడిపి నుంచి మాగుంట శ్రీనివాసులురెడ్డి గెలుపొందినట్టు విశ్లేషిస్తున్నారు.

వైసిపి నుంచి టికెట్‌ రాకపోవడంతో పాటు, ఈసారి టిడిపి ”పవనాలు” రాష్ట్రంలో బలంగా వీచడంతో మాగుంటకు కలిసివచ్చిందని భావిస్తున్నారు. ఎన్‌డిఏ కూటమిలో ఉన్న జనసేన బలం, బిజెపి పార్టీ కేడర్‌ సపోర్ట్‌తో ఈసారి టిడిపి ఒంగోలు పార్లమెంట్‌ సెగ్మంట్‌లో బలమైన కేడర్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ ఎన్నికల్లో వైసిపి కంచుకోటగా ఉన్న ఒంగోలు పార్లమెంట్‌లో టిడిపి నుంచి పోటీచేసిన మాగుంట పాతికేళ్ళ తరువాత టిడిపి జెండా ఎగరవేసేలా పరిస్థితులు దారితీశాయని అంచనా వేస్తున్నారు… ఏదిఏమైనా ఒంగోలు పార్లమెంట్‌ స్థానంలో పాతికేళ్ళ తరువాత టిడిపి గెలుపొందడం ఆపార్టీ శ్రేణులకు నూతనోత్సాహన్ని నింపిందనడంలో సందేహం లేదు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!