AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakhapatnam: విశాఖ మేయర్ పీఠంపై కూటమి కన్ను.. కీలక వ్యూహం

సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే కూటమి రాష్ట్రం లోని ఇతర ముఖ్యమైన కార్పొరేషన్ లు, జిల్లా పరిషత్ లపై దృష్టి సారించింది. ముఖ్యంగా కీలకమైన విశాఖపట్నం లాంటి నగరాలపై స్థానిక సంస్థల పట్టు సాధించి వైఎస్ఆర్సీపీ కేడర్ ను నిర్వీర్యం చేయాలని ప్రణాలికలు చేస్తుంది. అందులో భాగంగా మొదటగా మేయర్ పదవిపై కన్నేసింది కూటమి. ఇందుకోసం..

Visakhapatnam: విశాఖ మేయర్ పీఠంపై కూటమి కన్ను.. కీలక వ్యూహం
Visakhapatnam
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Jun 08, 2024 | 8:13 PM

Share

సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే కూటమి రాష్ట్రం లోని ఇతర ముఖ్యమైన కార్పొరేషన్ లు, జిల్లా పరిషత్ లపై దృష్టి సారించింది. ముఖ్యంగా కీలకమైన విశాఖపట్నం లాంటి నగరాలపై స్థానిక సంస్థల పట్టు సాధించి వైఎస్ఆర్సీపీ కేడర్ ను నిర్వీర్యం చేయాలని ప్రణాలికలు చేస్తుంది. అందులో భాగంగా మొదటగా మేయర్ పదవిపై కన్నేసింది కూటమి. ఇందుకోసం ఇప్పటికే వ్యూహం సిద్దం చేస్తోందట కూటమి నేతలు. గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ను కైవసం చేసుకునేందుకు వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల మద్దతు కోసం ఎన్డీయే నేతలు వారితో టచ్‌లో ఉన్నట్లు సమాచారం.

విశాఖ జిల్లా ను స్వీప్ చేసిన కూటమి

ఈ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా తెలుగుదేశం పార్టీ కంచుకోటగా మరోసారి గుర్తింపు తెచ్చుకుంది. అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీ, దాని కూటమి పార్టీలైన బీజేపీ, జేఎస్పీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇప్పుడు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ మరియు మేయర్ పదవిపై ఎన్‌డిఎ పార్టీ నేతలు దృష్టి సారించారు. జీ వీ ఎం సీ ను ఎలా కైవసం చేసుకోవాలనే దానిపై టీడీపీ సీనియర్ నేతలు ఇప్పటికే సమాలోచనలు చేస్తున్నారు.

జీ వీ ఎం సీ బలాబలాలు ఇలా?

జివిఎంసి కౌన్సిల్‌లో మొత్తం 98 మంది కార్పొరేటర్లు ఉండగా, వారిలో టిడిపికి 31 మంది, జనసేన పార్టీ నుండి ఐదుగురు, బిజెపి, సిపిఐ మరియు సిపిఐ (ఎం)లకు ఒక్కొక్క కార్పొరేటర్ ఉన్నారు. 59 మంది కార్పొరేటర్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులంతా కూటమి నుంచి వచ్చినవారే. కూటమికి మద్దతు ఇవ్వాలని కోరుతూ పలువురు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లతో ఎన్డీయే నేతలు టచ్‌లో ఉన్నట్లు తెలిసింది. జేఎస్పీ కి చెందిన ఒక సీనియర్ కార్పొరేటర్ మాట్లాడుతూ, “వైఎస్‌ఆర్‌సిపికి చెందిన దాదాపు 15 మంది కార్పొరేటర్లు వాళ్ళ పార్టీని వీడి ఎన్‌డిఎలో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కౌన్సిల్‌ను కైవసం చేసుకుని మేయర్‌ పదవిని దక్కించుకునేందుకు ఎక్కువ సంఖ్యలో కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యుల నుంచి మద్దతు పొందాలని ఎన్డీయే నేతలు యోచిస్తున్నారు. గత కొన్నేళ్లుగా జివిఎంసి కౌన్సిల్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ అనేక అక్రమాలకు పాల్పడుతోందని టిడిపి సీనియర్ కార్పొరేటర్ ఒకరు ఆరోపించారు.

నాలుగేళ్ల దాకా నో అవిశ్వాసం

మేయర్ పదవికి నాలుగేళ్లు పూర్తయ్యే వరకు మండలిలో అవిశ్వాస తీర్మానం పెట్టలేమని వైఎస్సార్‌సీపీ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిందని ఎన్‌డీఏ కార్పొరేటర్లు చెబుతున్నారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు వీలుగా హైకమాండ్ ఖచ్చితంగా జోక్యం చేసుకుని గెజిట్‌ను సవరించవచ్చని, ఆ దిశగా సవరిస్తామని కూడా చెప్తున్నారు. ఆలోచన ప్రారంభం అయింది కాబట్టి ఇక ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత వ్యూహాలకు పదును పెట్టీ వీలైనంత వరకు జీ వీ ఎం సీ నీ స్వాధీనం చేసుకోవాలన్న లక్ష్యంతో కూటమి నేతలు ముందుకు వెళ్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి