Watch Video: ‘ఏపీ ఫైబర్ గ్రిడ్‎లో నష్టనివారణ చేపట్టాం’.. మాజీ APSFL చైర్మన్ గౌతం రెడ్డి..

ప్రభుత్వం మారాక.. ఏపీలో పలు శాఖల చైర్మన్ల రాజీనామాలు కొనసాగుతున్నాయి. తాజాగా APSFL చైర్మన్ పదవికి రాజీనామా చేశారు గౌతమ్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ పదవికి వైసీపీ నేత పూనూరి గౌతంరెడ్డి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమితో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత పాలకుల వైఫల్యంతో ప్రతినెల ఫైబర్ గ్రిడ్ కు 15కోట్ల నష్టం వచ్చేది..తాను బాధ్యతలు స్వీకరించిన తరువాత నష్టాలను నివారించానని చెప్పారు. సరసమైన ధరలకే నెట్ ను ప్రజానీకానికి అందించామని చెప్పారు.

Watch Video: 'ఏపీ ఫైబర్ గ్రిడ్‎లో నష్టనివారణ చేపట్టాం'.. మాజీ APSFL చైర్మన్ గౌతం రెడ్డి..

|

Updated on: Jun 09, 2024 | 8:26 AM

ప్రభుత్వం మారాక.. ఏపీలో పలు శాఖల చైర్మన్ల రాజీనామాలు కొనసాగుతున్నాయి. తాజాగా APSFL చైర్మన్ పదవికి రాజీనామా చేశారు గౌతమ్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ పదవికి వైసీపీ నేత పూనూరి గౌతంరెడ్డి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమితో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత పాలకుల వైఫల్యంతో ప్రతినెల ఫైబర్ గ్రిడ్ కు 15కోట్ల నష్టం వచ్చేది..తాను బాధ్యతలు స్వీకరించిన తరువాత నష్టాలను నివారించానని చెప్పారు. సరసమైన ధరలకే నెట్ ను ప్రజానీకానికి అందించామని చెప్పారు. అలాగే ఓటీటీ ప్లాట్ ఫాంను సిద్ధం చేశామన్నారు. ఫస్ట్ డే ఫస్ట్ సినిమా పేరుతో ఫైబర్ గ్రిడ్ లో లాంచ్ చేశామని గౌతంరెడ్డి చెప్పారు. రాబోయే ప్రభుత్వం అన్నివిధాలా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నామన్నారు. ఫైబర్ నెట్ లో తీసుకున్న నిర్ణయాలకు జగన్ అన్ని విధాలా సహకరించారు. గతంలో ఎండీ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుగుతుందన్నారు గౌతమ్ రెడ్డి. గవర్నర్ ఆదేశాలతో పోలీసులు ఎపీఎస్ఎఫ్ఎల్ కార్యాలయం వద్ద బందోబస్తు ఉన్నారని అనుకుంటున్నాని చెప్పారు. వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులపై ఇప్పటికే గవర్నర్‎కు ఫిర్యాదు చేశామన్నారు. ప్రతీకార చర్యగా వైసీపీ ఉంటుందని అనుకోవడం లేదని చెప్పారు గౌతంరెడ్డి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow us
Latest Articles