ACB Officials: న్యాయవాదిపై రౌడీషీట్ నమోదు.. కట్ చేస్తే ఎస్సై అరెస్ట్.. ఉలిక్కిపడ్డ పోలీస్ డిపార్ట్మెంట్..

| Edited By: Srikar T

Jan 05, 2024 | 3:58 PM

ప్రకాశంజిల్లా దర్శిలో 2022 సంవత్సరంలో జరిగిన ఓ హత్య కేసులో తన తండ్రి, సోదరుడితో కలిసి నిందితుడిగా ఉన్నట్లు రికార్డ్ అయింది. ఇందులో నిందితుడిగా చేర్చబడిన రమణయ్య ఒంగోలులో లాయర్‌గా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. అయితే ఓ హత్యకేసులో నిందితుడిగా ఉన్నట్లు శేషం రమణయ్యపై దర్శి పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీట్‌ తెరిచారు. అయితే తనపై అన్యాయంగా రౌడీ షీట్‌ తెరిచారని లాయర్‌గా ఉన్న శేషం రమణయ్య హైకోర్టును ఆశ్రయించారు.

ACB Officials: న్యాయవాదిపై రౌడీషీట్ నమోదు.. కట్ చేస్తే ఎస్సై అరెస్ట్.. ఉలిక్కిపడ్డ పోలీస్ డిపార్ట్మెంట్..
Darshi Si
Follow us on

ప్రకాశంజిల్లా దర్శిలో 2022 సంవత్సరంలో జరిగిన ఓ హత్య కేసులో తన తండ్రి, సోదరుడితో కలిసి నిందితుడిగా ఉన్నట్లు రికార్డ్ అయింది. ఇందులో నిందితుడిగా చేర్చబడిన రమణయ్య ఒంగోలులో లాయర్‌గా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. అయితే ఓ హత్యకేసులో నిందితుడిగా ఉన్నట్లు శేషం రమణయ్యపై దర్శి పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీట్‌ తెరిచారు. అయితే తనపై అన్యాయంగా రౌడీ షీట్‌ తెరిచారని లాయర్‌గా ఉన్న శేషం రమణయ్య హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు విచారించి నివేదక ఇవ్వాలని జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆదేశించింది. జిల్లా ఎస్పీ దీనిపై నివేదక పంపించాలని దర్శి ఎస్సై రామకృష్ణకు ఉత్వర్తులు జారీచేశారు. ఈ నేపధ్యంలో రౌడీషీట్‌ గా ఉన్న న్యాయవాది శేషం రమణయ్య దర్శి ఎస్‌ఐ రామకృష్ణను కలిశారు.

ఆ తరువాత తనపై రౌడీషీట్‌ తొలగించాలంటే.. ఎస్సై రామకృష్ణ రూ. 20 వేలు లంచం అడిగారని రమణయ్య ఒంగోలు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్‌ ప్రకారం రమణయ్యను దర్శి పోలీస్ స్టేషన్‌కు రూ. 20 వేలు ఇచ్చి పంపించారు. దర్శి పోలీస్‌ స్టేషన్‌లో రమణయ్య నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా ఎస్సై రామకృష్ణను ఏసీబీ డీఎస్పీ వల్లూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఎస్సై దగ్గర నుంచి రూ. 20 వేలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. న్యాయవాదిపై ఉన్న రౌడీషీట్‌ను తొలగించేలా నివేదిక ఇచ్చేందుకు రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఎస్సై రామకృష్ణ ఏసీబీకి పట్టుబటడంతో పోలీసుశాఖ ఉలిక్కిపడింది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో సిబ్బంది లంచాలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడుతుండటంతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. సిబ్బంది అవినీతికి పాల్పడకుండా ఉండేందుకు శాఖాపరమైన చర్యలతో పాటూ నిఘాను మరింత పెంచాలని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..