అమరావతి, అక్టోబర్ 19: తెలుగు దేశం పార్టీ(టీడీపీ) చీఫ్ చంద్రబాబుకు మరో సారి ఉరట లభించలేదు. స్కిల్ స్కాం కేసులో రిమాండ్‌ను నవంబర్ 1వ తేదీ వరకు పొడిగించింది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు రిమాండ్‌ను పొడిగించాలని ఆదేశించింది. దీంతో చంద్రబాబు రిమాండ్‌ను నవంబర్ 1వ తేదీ వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశించింది. గతంలో ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ ఇవాళ్టితో ముగియడంతో రాజమండ్రి జైలు అధికారులు చంద్రబాబును వర్చువల్‌గా కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు. అనంతరం రిమాండ్‌ను నవంబర్ 1 వరకు పొడిగిస్తున్నట్లు ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని వెల్లడించింది.
ఇదే సమయంలో తన సెక్యూరిటీ విషయంలో అనుమానాలున్నాయని చంద్రబాబు ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తాను జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి అంటూ చంద్రబాబు ఏసీబీ కోర్టు జడ్జికి తెలిపారు. అయితే ఈ విషయమై రాతపూర్వకంగా ఇవ్వాలని ఏసీబీ కోర్టు జడ్జి చంద్రబాబుకు సూచించారు. దీంతో చంద్రబాబు రాసే లేఖను తనకు పంపాలని ఏసీబీ కోర్టు జడ్జి రాజమండ్రి జైలు అధికారులను ఆదేశించారు. జైలు లోపల, బయట తన భద్రతపై కొన్ని అనుమానాలున్నాయని చంద్రబాబు జడ్జికి వివరించారు.
హైకోర్టులో స్కిల్ కేసు పెండింగ్‌లో ఉందని చంద్రబాబుకు ఏసీబీ కోర్టు జడ్జి చెప్పారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి అధికారులను జడ్జి అడిగారు. మెడికల్ రిపోర్టులు ఎప్పటికప్పుడు కోర్టుకు సమర్పించాలని అధికారులకు జడ్జి ఆదేశించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి