AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu Naidu: నవంబర్‌ 1వ తేదీ వరకు రిమాండ్‌ పొడిగింపు.. స్కిల్‌ కేసులో చంద్రబాబు రిమాండ్‌ పొడిగించిన ఏసీబీ కోర్టు

స్కిల్‌ స్కాం కేసులో రిమాండ్‌ను నవంబర్ 1వ తేదీ వరకు పొడిగించింది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు రిమాండ్‌ను పొడిగించాలని ఆదేశించింది. దీంతో చంద్రబాబు రిమాండ్‌ను నవంబర్ 1వ తేదీ వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశించింది. గతంలో ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్‌ ఇవాళ్టితో ముగియడంతో రాజమండ్రి జైలు అధికారులు చంద్రబాబును వర్చువల్‌గా కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు. అనంతరం రిమాండ్‌ను నవంబర్‌ 1 వరకు పొడిగిస్తున్నట్లు..

Chandrababu Naidu: నవంబర్‌ 1వ తేదీ వరకు రిమాండ్‌ పొడిగింపు.. స్కిల్‌ కేసులో చంద్రబాబు రిమాండ్‌ పొడిగించిన ఏసీబీ కోర్టు
Chandrababu
Sanjay Kasula
|

Updated on: Oct 20, 2023 | 8:58 AM

Share

అమరావతి, అక్టోబర్ 19: తెలుగు దేశం పార్టీ(టీడీపీ) చీఫ్ చంద్రబాబుకు మరో సారి ఉరట లభించలేదు. స్కిల్‌ స్కాం కేసులో రిమాండ్‌ను నవంబర్ 1వ తేదీ వరకు పొడిగించింది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు రిమాండ్‌ను పొడిగించాలని ఆదేశించింది. దీంతో చంద్రబాబు రిమాండ్‌ను నవంబర్ 1వ తేదీ వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశించింది. గతంలో ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్‌ ఇవాళ్టితో ముగియడంతో రాజమండ్రి జైలు అధికారులు చంద్రబాబును వర్చువల్‌గా కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు. అనంతరం రిమాండ్‌ను నవంబర్‌ 1 వరకు పొడిగిస్తున్నట్లు ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని వెల్లడించింది.

ఇదే సమయంలో తన సెక్యూరిటీ విషయంలో అనుమానాలున్నాయని చంద్రబాబు ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తాను జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి అంటూ చంద్రబాబు ఏసీబీ కోర్టు జడ్జికి తెలిపారు. అయితే ఈ విషయమై రాతపూర్వకంగా ఇవ్వాలని ఏసీబీ కోర్టు జడ్జి చంద్రబాబుకు సూచించారు. దీంతో చంద్రబాబు రాసే లేఖను తనకు పంపాలని ఏసీబీ కోర్టు జడ్జి రాజమండ్రి జైలు అధికారులను ఆదేశించారు. జైలు లోపల, బయట తన భద్రతపై కొన్ని అనుమానాలున్నాయని చంద్రబాబు జడ్జికి వివరించారు.

హైకోర్టులో స్కిల్‌ కేసు పెండింగ్‌లో ఉందని చంద్రబాబుకు ఏసీబీ కోర్టు జడ్జి చెప్పారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి అధికారులను జడ్జి అడిగారు. మెడికల్‌ రిపోర్టులు ఎప్పటికప్పుడు కోర్టుకు సమర్పించాలని అధికారులకు జడ్జి ఆదేశించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి