ఆంధ్రప్రదేశ్ లో పేర్ల మార్పు కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. తాజాగా విశాఖలో అబ్దుల్ కలాం వ్యూ పాయింట్‌ను.. వైఎస్‌ఆర్ వ్యూ పాయింట్‌గా మార్చడం వివాదాస్పదంగా మారింది. ఈ మధ్య జీ20 సన్నాహక సదస్సు సందర్భంగా కోట్ల రూపాయలు కేటాయించి వ్యూ పాయింట్‌ను అభివృద్ది చేసింది ప్రభుత్వం. అందులో భాగంగానే వ్యూ పాయింట్‌ను అభివృద్ది చేసింది. అయితే సీత కొండగా ఉన్న వ్యూ పాయింట్‌ను అప్పట్లో అబ్దుల్ కలాం పేరుగా మార్చారు. ఇప్పుడు వైఎస్సాఆర్‌గా నామకరణం చేయడంపై రాజకీయ రణం నడుస్తోంది. విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇటు సోషల్ మీడియాలో అటు రాజకీయ వర్గాల్లోనూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కలాం వ్యూ పాయింట్ పేరును రాష్ట్ర ప్రభుత్వం మార్చడంపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. అబ్దుల్ కలాం పేరును తొలగించి వైఎస్సార్ వ్యూ పాయింట్‌గా మార్చడం బాధాకరం అన్నారు. ఇప్పటికే ప్రభుత్వ తీరును విమర్శిస్తూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆ మహనీయుడు పేరు తీసేయడం కలాంను అవమానించడమేనని ట్వీట్ చేశారు. అంత పెద్దాయన పేరు తీసేస్తే జనం ఏమనుకుంటారో కూడా ఆలోచించారా అని నిలదీసింది టీడీపీ.
కాలం వ్యూస్ పాయింట్ పేరు పై బీజేపీ నేతలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కౌన్సిలర్ల తీర్మానం లేకుండా రాత్రికి రాత్రే పేరు ఎలా మారుస్తారని ప్రశ్నింస్తోంది బీజేపీ యువమోర్చా. అయితే పేరు మార్పుపై టీడీపీ, బీజేపీ వెర్షన్ ఎలా ఉన్నా వైసీపీ నేతలు సమర్ధించుకుంటున్నారు.
ప్రభుత్వ వెర్షన్ ఏమిటంటే:
చంద్రబాబు కలాం వ్యూ పాయింట్ పై చేసిన కామెంట్స్ పై వైసీపీ నేతలు స్పదించారు. విశాఖ బీచ్ వ్యూపాయింట్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం. వాస్తవానికి ఇక్కడ ఉన్న స్థలంలో గత ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయలేదని స్పష్టం చేసింది. వ్యూ పాయింట్‌గా వ్యవహరించేవారు. అంతేగాని అధికారికంగా పేరు పెట్టలేదుని తెలిపింది. తాజాగా జీ-20 సదస్సు కోసం చేపట్టిన నగర సుందరీకరణ పనుల సమయంలో ఇక్కడ వ్యూ పాయింట్ ను అభివృద్ధి చేసేందుకు అనుమతులు ఇచ్చారు. దీంతో తాము అక్కడ వ్యూ పాయింట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చంద్రబాబు చేసిన ఆరోపణలపై స్పందించిన ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ ద్వారా స్పష్టతనిచ్చిన ప్రభుత్వం
The space was not developed, used as a view point and not been officially named earlier. Appropriate permissions were obtained and the viewpoint was established during the #G20Summit city beautification works. Here is the Before photo, permission copies and paper clip. https://t.co/ADyaGhCLYL pic.twitter.com/Zl70QOBVll
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) April 19, 2023
ఇందుకు సంబంధించిన ఆధారాలను సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ అధికారులు ఫోటోలు, అనుమతికి సంబంధించిన లెటర్ ను పేపర్ క్లిప్స్ ను జత చేసింది వైసీపీ సర్కార్..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..