AB Venkateshwar Rao: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఇష్యూ కొత్త టర్న్ తీసుకుంది. సీఎస్‌ను కలిసేందుకు చేసిన ప్రయత్నం ఫలించ లేదు. జస్ట్ సింపుల్‌గా పీఏకు పేపర్ ఇచ్చి వెనక్కి వచ్చేశారు. ఇది కుట్ర పూరితంగానే జరిగిందంటూ సంచలన కామెంట్ చేశారు ఏబీవీ.
తన సస్పెన్షన్ చట్ట విరుద్ధమని హైకోర్టు తేల్చిందని చెప్పారు ఏబీ వెంకటేశ్వర్‌రావు. ఈ విషయంలో చట్టప్రకారమే తాను ముందుకెళ్లానన్నారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి వెయిటింగ్ పీరియడ్‌గా పరిగణిస్తామని ఉత్తర్వులివ్వడాన్ని తప్పుబట్టారు ఏబీవీ. తాను తప్పు చేస్తే శిక్షించాలని.. మీడియాలో బురదజల్లే ప్రయత్నం చేయొద్దని కోరారు.
GADలో రిపోర్ట్ చేయడం వరకే నా పని అన్నారు ఏబీవీ. ప్రభుత్వం జారీ చేసి ఉత్తర్వును సరిచేయాలని కోరేందుకు సీఎస్ సమీర్ శర్మను కలిసేందుకు ప్రయత్నించానన్నారు. కానీ వినతిపత్రాన్ని పీఏకు ఇచ్చి వెళ్లాలని సూచించారన్నారు. నన్ను కలవడం సీఎస్‌కు ఇష్టం లేదేమోనని.. నా వినతిపత్రం చదివితే కదా దానిలో ఏముందో తెలిసేది తెలిసేదన్నారు. పోస్టింగ్ ఇవ్వలేదు.. జీతం ఇచ్చేందుకు ఇబ్బందేంటని ప్రశ్నించారు. కొంతమందిని ఏళ్ల తరబడి వీఆర్‌లో ఉంచి జీతాలు ఇవ్వడం లేదన్నారు. తప్పు చేస్తే శిక్షించాలి లేదా సమయానికి జీతం ఇవ్వాలని హితవు పలికారు ఏబీవీ. మొత్తంగా ఏపీలో మళ్లీ ఏబీ వెంకటేశ్వర్‌రావు వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ఇష్యూ ఇంకెన్ని మలుపులు తిరగనుందో చూడాలి మరి.