అయ్యో.. కదులుతున్న రైలు ఎక్కబోయి ఇరుక్కున్న మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే

|

Apr 29, 2023 | 1:59 PM

కొంతమంది ప్రయాణికులు బస్సు లేదా రైలు కదులున్నప్పుడు ఎక్కేందుకు ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు ఎక్కలేక కిందపడిపోయిన ఘటనలు కూడా ఎన్నో చోటుచేసుకున్నాయి. అయితే తాజాగా ఓ మహిళ రైలు ఎక్కిందుకు యత్నించి రైలు బోగీ, ఫ్లాట్‌ మధ్యలో ఇరుక్కుపోయింది.

అయ్యో.. కదులుతున్న రైలు ఎక్కబోయి ఇరుక్కున్న మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే
Train
Follow us on

కొంతమంది ప్రయాణికులు బస్సు లేదా రైలు కదులున్నప్పుడు ఎక్కేందుకు ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు ఎక్కలేక కిందపడిపోయిన ఘటనలు కూడా ఎన్నో చోటుచేసుకున్నాయి. అయితే తాజాగా ఓ మహిళ రైలు ఎక్కిందుకు యత్నించి రైలు బోగీ, ఫ్లాట్‌ మధ్యలో ఇరుక్కుపోయింది. ఈ ఘటన బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే విజయవాడ నుంచి గూడూరు వరకు ప్రయాణించే మెమో ఎక్స్‌ప్రెస్‌ను ఉదయం 8 గంటలకు చీరాల స్టేషన్‌కు వచ్చింది. అయితే ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరెడు గ్రామానికి చెందిన కట్టా తిరుపతమ్మ అనే మహిళ స్టేషన్‌లో దిగింది. తన పని చేసుకొని కదులుతున్న రైలును ఎక్కేందుకు యత్నించింది.

దీంతో ఒక్కసారిగా కాలు జారి పడిపోయింది. ఫ్లాట్‌ఫాం, రైలు భోగీ మధ్యన చిక్కుకుంది. ఇది గమనించిన ఆర్పీఎఫ్, జీఆర్పీ కానిస్టేబుళ్లు డి. కోటేశ్వరరావు,నాగార్జు విజిల్స్ వేస్తూ రైలు ఆపేశారు. తోటి ప్రయాణికులు, స్థానికుల ఫ్లాట్‌ఫాంను పగలగొట్టి తిరుపతమ్మను అతికష్టం మీద బయటకు తీశారు. ఆమెకు పొట్ట వద్ద తీవ్ర గాయాలు కావడంతో చిరాల ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తలు చదవండి..