ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్-2023 ఆన్‌లైన్ దరఖాస్తు రికార్డు స్థాయిలో వచ్చాయి. ఏప్రిల్ 15వ తేదీతో ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. దీంతో దరఖాస్తు సమయం ముగిసే నాటికి మొత్తం 3,26,315 దరఖాస్తులు వచ్చినట్లు కన్వీనర్ ఆచార్య శోభాబిందు తెలిపారు. గతేడాదితో పోల్చితే ఈ సారి 25 దరఖాస్తులు పెరిగినట్లు వెల్లడించారు. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి గతేడాది మొత్తం 2,06,579 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఈ సారి ఇప్పటివరకు 2,22,850 దరఖాస్తులు వచ్చాయని ఈఏపీసెట్ కన్వీనర్ శోభాబింధు తెలిపారు. రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 30 వరకు, రూ.1000 ఆలస్య రుసుముతో మే 5 వరకు, రూ.5 వేల ఆలస్య రుసుముతో మే 12 వరకు, రూ.10 వేల ఆలస్య రుసుముతో మే 14 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
ఇంజనీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే ఈఏపీసెట్ మే 15 నుంచి 22 వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు కేవలం ఉదయం సెషన్‌లో మాత్రమే నిర్వహించాల్సి ఉండగా.. ఈసారి దరఖాస్తులు పెరిగిన నేపథ్యంలో మే 19 మధ్యాహ్నం సెషన్‌లోనూ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని తెలిపారు. ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షను ఆయా తేదీల్లో రోజుకు 30 వేల మంది చొప్పున రాసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అడ్మిట్ కార్డులు మే 7వ తేదీ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.