Andhra Pradesh: తాడిపత్రిలో అర్థరాత్రి రోడ్డు ప్రమాదం.. వైసీపీ నేత హత్యకు ప్రయత్నం..?!

అనంతపురం జిల్లా తాడిపత్రిలో అర్థరాత్రి రోడ్డు ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. స్థానిక వైసీపీ నాయకుడు హరినారాయణ రెడ్డి వాహనాన్ని ఢీకొట్టింది టెంపో. ప్రధాన రహదారిపై బొందలదిన్నె సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, ప్రమాదం జరగగానే టెంపో వదిలి పారిపోయాడు డ్రైవర్‌.

Andhra Pradesh: తాడిపత్రిలో అర్థరాత్రి రోడ్డు ప్రమాదం.. వైసీపీ నేత హత్యకు ప్రయత్నం..?!
Accident

Updated on: Apr 21, 2023 | 5:53 AM

అనంతపురం జిల్లా తాడిపత్రిలో అర్థరాత్రి రోడ్డు ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. స్థానిక వైసీపీ నాయకుడు హరినారాయణ రెడ్డి వాహనాన్ని ఢీకొట్టింది టెంపో. ప్రధాన రహదారిపై బొందలదిన్నె సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, ప్రమాదం జరగగానే టెంపో వదిలి పారిపోయాడు డ్రైవర్‌. ప్రమాదంలో హరి నారాయణ రెడ్డికి ఎలాంటి గాయాలు అవలేదు. విషయం తెలుసుకున్న జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పతాడిపత్రి పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. కాగా, ప్రత్యర్థులే తనను చంపేందుకు ప్రయత్నించారని హరి నారాయణ రెడ్డి ఆరోపిస్తున్నారు. తన ఎదుగదలను తట్టులేక, ప్రజలకు సేవ చేస్తుంటే చూసి ఓర్వలకు తనపై హత్యాయత్నం చేశారని అన్నారు. నిందితులను గుర్తించి, చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. కాగా, ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

విజయవాడలో ట్రావెల్స్‌ బస్సు బోల్తా..

ఇదిలాఉంటే.. విజయవాడలో ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. గొల్లపూడి దగ్గర BSR ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది టిప్పర్‌. దాంతో బస్సులో ప్రయాణిస్తున్న 20మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఇక టిప్పర్ ఢీకొట్టడంతో బస్సు డివైడర్‌ను ఢీకొట్టింది. దాంతో బస్సు ముందు చక్రాలు ధ్వంసం అయ్యాయి. బస్సు రోడ్డుపై పడిపోవడంతో హైవేపై భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. వెంటనే ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు.. బోల్తా పడిన బస్సును క్రేన్ సహాయంతో పక్కకు జరిపారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..