స్కూల్ లో ఇవేం పనులు.. టీచర్ అన్న కనీస మ్యానెస్ లేకుండా.. వీడియో తీసి.. ఆపై..

Ganesh Mudavath

Ganesh Mudavath |

Updated on: Jan 08, 2023 | 8:53 AM

స్కూల్ లో చక్కగా చదువుకోవాల్సిన స్టూడెంట్స్ బౌండరీ లైన్స్ దాటుతున్నారు. నిన్న మొన్నటి వరకు తోటి స్టూడెంట్స్ తో అసభ్యంగా వ్యవహరిస్తున్న విద్యార్థులు ఇప్పుడు మహిళా టీచర్లతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు....

స్కూల్ లో ఇవేం పనులు.. టీచర్ అన్న కనీస మ్యానెస్ లేకుండా.. వీడియో తీసి.. ఆపై..
Video Shooting

స్కూల్ లో చక్కగా చదువుకోవాల్సిన స్టూడెంట్స్ బౌండరీ లైన్స్ దాటుతున్నారు. నిన్న మొన్నటి వరకు తోటి స్టూడెంట్స్ తో అసభ్యంగా వ్యవహరిస్తున్న విద్యార్థులు ఇప్పుడు మహిళా టీచర్లతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ఈ రకమైన హరాస్మెంట్ మరింత అధికమైంది. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. టీచర్ పాఠాలు చెబుతున్న సమయంలో ఓ విద్యార్థి వీడియో తీసి, అసభ్యకరమైన మ్యూజిక్ యాడ్ చేసి, సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలోని ఓ హై స్కూల్ లో విద్యార్థుల ప్రవర్తన గాడి తప్పుతోంది. ఉపాధ్యాయుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనలు గతంలోనూ అనేకం జరగడం గమనార్హం.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటన.. ఆందోళన కలిగిస్తోంది. ఓ లేడీ టీచర్.. బోర్డు వైపు తిరిగి పాఠాలు చెబుతున్న సమయంలో ఆమెను వెనుక నుంచి వీడియో తీశారు. ఆ క్లిప్ కు ఆశ్లీల పాట యాడ్ చేసి, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు ఓ స్టూడెంట్. ఆ వీడియోను అప్పటికే చాలా మంది చూశారు. విషయం ఊరంతా తెలిసింది. విషయం తెలుసుకున్న టీచర్.. హెచ్ఎం దృష్టికి తీసుకెళ్లారు.

దీనిని తీవ్రంగా తీసుకున్న హెచ్ఎం.. సదరు విద్యార్థి పేరెంట్స్ ను స్కూల్ కు పిలిపించారు. వారి కుమారుడు చేసిన బాగోతాన్ని వివరించారు. ఇక్కడ చదవడానికి వీల్లేదని, టీసీ తీసుకుని వెళ్లిపోవాలని ఘాటుగా వార్నింగ్ ఇచ్చాడు. తమ కుమారుడు చేసిన పని పట్ల పేరెంట్స్ తలదించుకున్నారు. ఈ ఒక్కసారికి మన్నించాలని వేడుకున్నారు. దీంతో బాధిత ఉపాధ్యాయురాలు, హెచ్ఎం.. ఇంకో సారి ఇలా జరగకుండా చూసుకోవాలని చెప్పి పంపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu