Andhra News: ఛీ.. ఛీ.. వీళ్ళు బంధువులా? లేక రాబందువులా? తల్లి అని కనికరం లేకుండా..

| Edited By: Velpula Bharath Rao

Dec 16, 2024 | 1:48 PM

కృష్ణా జిల్లాలో జరిగిన ఓ ఘటన అందరిని కలచి వేస్తుంది. నవ మాసాలు మోసి కనిపించిన ఆ తల్లిని నడిరోడ్డుపై వదిలేసి వెళ్ళిపోయారు. వృద్ధురాలనే కనికరం కూడా లేకుండా కారులో తీసుకువచ్చి రోడ్డుపై వదిలేసి వెళ్లారు.

Andhra News: ఛీ.. ఛీ.. వీళ్ళు బంధువులా? లేక రాబందువులా? తల్లి అని కనికరం లేకుండా..
A Son Who Left His Mother On The Road In Krishna District
Follow us on

వృద్ధులైన తల్లిదండ్రులను కొందరు మూర్ఖులు భారంగా భావిస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేసిన వారిని కూడా అనాధలుగా నడిరోడ్డుపై వదిలేసి వెళ్ళిపోతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న కన్న తల్లిదండ్రులను దగ్గరుండి చూసుకోవాల్సిన వారే తల్లిదండ్రుల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారు. కృష్ణా జిల్లాలో జరిగిన ఓ ఘటన అందరిని కలచి వేస్తుంది.

కన్నా అమ్మే వారికి బరువైంది. నవ మాసాలు మోసి కనిపించిన ఆ తల్లిని నడిరోడ్డుపై వదిలేసి వెళ్ళిపోయారు. వృద్ధురాలనే కనికరం కూడా లేకుండా కారులో తీసుకువచ్చి రోడ్డుపై వదిలేసి వెళ్లారు. మరోవైపు తీవ్రమైన చలి ఉండటంతో ఆ తల్లి చలిలో అల్లాడిపోయింది. వృద్ధురాలని కూడా చూడకుండా కారులో తీసుకొచ్చి రోడ్డుపై కొందరు మూర్ఖులు వదిలేశారు. తీవ్రమైన చలిలో ఆ వృద్ధురాలు వణికిపోతున్నా వారు పట్టించుకోకుండా వెళ్ళిపోయారు.. గన్నవరం శివారులో జరిగిన ఈ ఘటన అందరిని కలచి వేస్తుంది.

స్థానిక ప్రజలు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకొని విచారణ చేపట్టారు. స్థానిక హైవేను ఆనుకొని ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలోని హోటల్ వద్దకు అర్ధరాత్రి సమయంలో కొందరు కారులో ఆమెను తీసుకువచ్చి వదిలి వెళ్ళినట్లు గుర్తించారు. సుమారు 80 ఏళ్ల వృద్ధురాలిని రోడ్డుపై అక్కడ దించేసి కుర్చీలో కూర్చోపెట్టి వెళ్ళిపోయారు. చలికి వణికిపోతున్న ఆమెను చూసిన స్థానిక ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. వృద్ధురాలతో మాట్లాడిన పోలీసులు మాట్లాడలేని స్థితిలో ఉన్నట్లు గుర్తించి పీకేఆర్ వృద్ధాశ్రమంలో చేర్చారు. వృద్ధురాలి వద్ద లభ్యమైన ఆధార్ కార్డు ఆధారంగా కొండపావులూరుకు చెందిన నక్క లక్ష్మీకాంతమ్మగా గుర్తించారు. కుటుంబ సభ్యులను ఎందుకు వదిలేయాల్సి వచ్చింది అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి