Cyber Crime: కొత్త రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు.. ఇక అలాంటి యాప్‌లే లక్ష్యంగా మోసం..

| Edited By: Aravind B

Aug 22, 2023 | 11:44 AM

ఒకప్పుడు రకరకాల పిచ్చి పిచ్చి యాప్స్‎తో లోన్స్ అంటూ సామాన్యులను ట్రాప్ చేసి వేధింపులకు గురి చేసిన లోన్ యాప్ సైబర్ నేరగాళ్ళు ఇప్పడూ రూట్ మార్చారు. రెగ్యులర్‎గా గుర్తింపు లేని యాప్స్ పై పబ్లిక్ కు ఈ మధ్యకాలంలో అవగాహనా పెరగటంతో సైబర్ నేరగాళ్ళు ఏకంగా గుర్తింపు ఉన్న యాప్స్ టార్గెట్‎గా మళ్లీ కొత్తరకం దందా షురు చేశారు. మధ్యతరగతి సామాన్య ప్రజల ఆర్థిక అవసరాలే టార్గెట్‎గా లోన్ యాప్స్ పేరుతొ కొద్ది కాలంగా ఎంతో మందిని సైబర్ నేరగాళ్లు బలితీసుకున్నారు.

Cyber Crime: కొత్త రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు.. ఇక అలాంటి యాప్‌లే లక్ష్యంగా మోసం..
Cyber Crime
Follow us on

విజయవాడ న్యూస్, ఆగస్టు 22: ఒకప్పుడు రకరకాల పిచ్చి పిచ్చి యాప్స్‎తో లోన్స్ అంటూ సామాన్యులను ట్రాప్ చేసి వేధింపులకు గురి చేసిన లోన్ యాప్ సైబర్ నేరగాళ్ళు ఇప్పడూ రూట్ మార్చారు. రెగ్యులర్‎గా గుర్తింపు లేని యాప్స్ పై పబ్లిక్ కు ఈ మధ్యకాలంలో అవగాహనా పెరగటంతో సైబర్ నేరగాళ్లు ఏకంగా గుర్తింపు ఉన్న యాప్స్ టార్గెట్‎గా మళ్లీ కొత్తరకం దందా షురు చేశారు. మధ్యతరగతి సామాన్య ప్రజల ఆర్థిక అవసరాలే టార్గెట్‎గా లోన్ యాప్స్ పేరుతొ కొద్ది కాలంగా ఎంతో మందిని సైబర్ నేరగాళ్లు  బలితీసుకున్నారు. ఇచ్చిన అప్పుకంటే అధిక వడ్డీలు వసులు చెయ్యటం డేటా సేకరించి అసభ్యంగా ఫోటోలు మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడటంతో ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఇటీవల చాలానే చోటుచేసుకున్నాయి.

కొద్దికాలంగా పోలీసులు వీరిపై ఫోకస్ పెట్టి ఇతర రాష్ట్రాల్లో ఉండి ఆపరేట్ చేస్తున్న ముఠాను అరెస్ట్ చెయ్యటంతో కొద్దీ కాలంగా ఈ వేధింపులు తగ్గాయి. కానీ ఈ మధ్య మళ్ళీ కొత్తరకం వేధింపులు మొదలయ్యాయి. ఆర్బీఐ గుర్తింపు పొందిన కొన్ని సంస్థలను టార్గెట్ చేసి వాటిని పోలిన ఫేక్ ఐడి ,లింక్స్ క్రియేట్ చేసి సామాన్యుల నుండి దోచేస్తున్నారు. అయితే ఈసారి లోన్ ఇచ్చి వేధింపులు కాకుండా లోన్ ఇవ్వటానికి ఎదురు దోపిడీ ప్రారంభించారు. విజయవాడకు చెందిన ఓ వ్యక్తి రెడ్ బుల్ నుండి లోన్ వస్తుందనుకుని ఏకంగా ఎదురు లక్ష తగలేసాడు. ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులతో బయటపడటానికి ఒరిజినల్ రెడ్ బుల్ అనుకుని ఫెక్ రెడ్ బుల్ పేరుతో మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల చేతిలో పడి వున్న డబ్బులు పోగొట్టుకుని లబోదిబోమంటున్నాడు.

అలాగే ఐదు లక్షల లోన్ కోసం ఎదురు లక్ష పెట్టాల్సి వచ్చింది. మొదట ప్రోసెసింగ్ ఫీజ్ అని కొంత ,ఇన్సూరెన్ఫ్ అని మరికొంత ,ఆర్బీఐ మార్గదర్శకాలు అని మరికొంత ఇలా రకరకాల కారణాలతో 10 వేలు నుండి వసూలు చెయ్యటం ప్రారంభించి లక్ష వరకు వసులు చేసాక కళ్ళు తెరిచినా బాధితుడు మోసం చేస్తున్నారని గ్రహించాడు. గట్టిగా ప్రశ్నిస్తే ఫైనల్ ప్రోసెసింగ్ ఫీజ్ ఇంకో పది వేలు కడితే మీ అకౌంట్ లో డబ్బులు పడతాయని చెప్పటంతో ఒళ్ళు మండి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. కేస్ నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మధ్య కాలంలో ఫెక్ లైన్ యాప్స్ తో సైబర్ నేరగాళ్ళు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని పబ్లిక్ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు సైబర్ పోలీసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..