SI Suspend: ఎస్సై పై సస్పెన్షన్ వేటు.. మృతుడి బంధువుల ఆరోపణలతో ఉన్నతాధికారుల చర్యలు

|

Mar 16, 2022 | 4:15 PM

కృష్ణా జిల్లా ఏ.కొండూరు (A.kondur) ఎస్పై పై సస్పెన్షన్ (Suspend) వేటు పడింది. రేపూడితండాకు చెందిన లాకావత్ బాలాజీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాటుసారా కేసులో విచారణకు పిలిచి ఎస్సై కొట్టాడని, ఆ దెబ్బలు తాళలేక...

SI Suspend: ఎస్సై పై సస్పెన్షన్ వేటు.. మృతుడి బంధువుల ఆరోపణలతో ఉన్నతాధికారుల చర్యలు
Suspend
Follow us on

కృష్ణా జిల్లా ఏ.కొండూరు (A.kondur) ఎస్పై పై సస్పెన్షన్ (Suspend) వేటు పడింది. రేపూడితండాకు చెందిన లాకావత్ బాలాజీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాటుసారా కేసులో విచారణకు పిలిచి ఎస్సై కొట్టాడని, ఆ దెబ్బలు తాళలేక బాలాజీ ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి బంధువులు ఆందోళన చేపట్టారు. ప్రాధమిక దర్యాప్తు ఆధారంగా ఉన్నతాధికారులు ఎస్సై ను సస్పెండ్ చేశారు. నిర్లక్షంగా వ్యవహరించిన మైలవరం ఇన్స్పెక్టర్ ఎల్. రమేష్ పై క్రమశిక్షణ చర్యలు, నూజివీడు డిఎస్పీని వివరణ కోరుతూ నోటిసు జారీ చేశారు. మంగళవారం ఉదయం జరిగిన బాలాజీ ఆత్మహత్య (suicide) ఘటన.. ఎ.కొండూరులో ఉద్రిక్తతకు దారి తీసింది. తమకు న్యాయం చేయాలంటూ మృతుడి కుటుంబం ధర్నాకు దిగింది. ఎ.కొండూరు పరిధిలోని రేపూడి తండాకు చెందిన లాకావతు బాలాజీ నాటుసారా అమ్ముతున్నారనే ఆరోపణలతో స్థానిక పీఎస్ కు చెందిన కానిస్టేబుల్‌ సోమవారం రాత్రి విచారణ పేరుతో స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో ఎస్సై, సిబ్బంది బాలాజీని తీవ్రంగా కొట్టారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై ఇంటికి పంపించారు.

అయితే పోలీసుల లాఠీ దెబ్బలు తాళలేక, తీవ్ర మనస్తాపం చెందిన బాలాజీ మంగళవారం ఉదయం గంపలగూడెం మండలం నారికంపాడు సమీపంలోని బెల్టుషా్‌పలో మద్యం కొని, దానిలో పురుగుల మందు కలిపి తాగారు. ఈ క్రమంలో అపస్మారక స్థితికి ఉన్న బాలాజీని స్థానికుల సమాచారం మేరకు కుటుంబ సభ్యులు విస్సన్నపేటలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు.

Also Read

Womens World Cup 2022: ఓటమితో మారిన టీమిండియా లెక్కలు.. సెమీఫైనల్ చేరేందుకు అవకాశాలు ఎలా ఉన్నాయంటే?

Pawan Kalyan: పవన్ కల్యాణ్ చెప్పిన 1977 ఫార్ములా ఏంటి? ఏపీలో ఇది వర్కౌట్ అవుతుందా?

Superfoods: పురుషులను శక్తివంతులుగా మార్చే సూపర్ ఫుడ్స్.. అవేంటో తప్పనిసరిగా తెలుసుకోండి..