
పెళ్లైన కొన్నిరోజులకే భార్య లేదా భర్త ఎవరైన చనిపోతే ఆ కుటుంబ సభ్యు ఆవేదన వర్ణించలేనిది. అయితే కడప జిల్లాలోని ఓ జంట పెళ్లైన ఏడాదికే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే కడపలోని విజయ దుర్గా కాలనీకి చెందిన సాయికుమార్ రెడ్డి, హేమమాలినీలకు ఏడాది క్రితం పెళ్లైంది. సాయి కుమార్ వ్యాపారాలు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. గత కొద్ది రోజులుగా భార్యభర్తలిద్దరు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే హేమమాలిని 8 నెలల గర్భవతి కూడా. ఇలాంటి సమయంలో ఆర్థిక సమస్యలు ఎక్కువ కావడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.
జీవితంపై విరక్తి పుట్టి ఇక చేసేదేం లేక మంగళవారం రోజున రాత్రి కడప శివారులోని కనుమలోపల్లికి చేరుకున్నారు. రైలు రావడం చూసి దానికింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న కడప రైల్వే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అయితే దంపతుల మృతికి ఆర్థికపరమైన సమస్యలే కారణమా లేదా ఇతర కారణాలేమైన ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..