AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వళ్లంతా విపరీతంగా బొబ్బలు.. నొప్పి, జ్వరంతో తల్లడిల్లుతున్న చిన్నారి.. వింత వ్యాధి కలకలం

మహబూబాబాద్ జిల్లా గార్లలో ఓ ఫంక్షన్‌కి వెళ్లి వచ్చాక చిన్నారికి ఇన్ఫెక్షన్ సోకిందని బంధువులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో గార్ల మీద కూడా ఫోకస్ పడింది. అక్కడి వైద్యాధికారుల్లో కదలిక వచ్చినట్టు తెలుస్తోంది. కానీ, ఆస్పత్రుల్లో ఇటువంటి కేసు ఏదీ నమోదు కాకపోవడంతో ప్రస్తుతానికి స్తబ్దుగా ఉంది గార్ల గ్రామం.

వళ్లంతా విపరీతంగా బొబ్బలు.. నొప్పి, జ్వరంతో తల్లడిల్లుతున్న చిన్నారి.. వింత వ్యాధి కలకలం
Strange Disease
Balaraju Goud
|

Updated on: Oct 19, 2025 | 7:49 PM

Share

ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలులో పాపం ఒక పసిపాప ఒంటి నిండా బొబ్బలతో విలవిల్లాడిపోతోంది. తిన్న ఆహారం వికటించిందా, వేసుకున్న మందులేమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చాయా..? లేక, ఏదైనా కీటకం కాటేసిందా? అంతుబట్టక పాప తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. బాక్టీరియా, వైరస్ లేదా ఫంగస్ లాంటివాటితో ఇన్ఫెక్షన్లు సోకి చర్మంపై బొబ్బలు, దద్దుర్లు వస్తాయి. విపరీతమైన వేడి, చలితో కూడా బొబ్బలు వస్తాయి. కానీ, ఇవి మామూలు ఎలర్జీతో వచ్చే బొబ్బల్లా లేవు. చర్మవ్యాధి నిపుణులకు సైతం అంతుబట్టకుండా ఉంది.

చిన్నారికి వింత వ్యాధి సోకిందన్న ప్రచారం ఆ ఊరంతా పాకి, జనంలో ఆందోళన మొదలైంది. జిల్లా వైద్య శాఖ అధికారులు అలెర్ట్‌ అయ్యారు. పెనుగంచిప్రోలులో ఇల్లిల్లూ తిరిగి గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు. చిన్నారికి చికిత్స అందించి, టెస్టుల కోసం విజయవాడ GGH‌కి తరలించారు.

పెనుగంచిప్రోలులో ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఇంకా ఎవరికైనా ఇటువంటి ఇన్ఫెక్షన్ సోకిందా? అని ఆరా తీస్తున్నారు. ఇదొక వింత వ్యాధి అనే ప్రచారాన్ని ఖండించిన అధికారులు.. అపోహలు నమ్మవద్దని సూచించారు. చిన్నారికి సోకిన ఇన్ఫెక్షన్‌పై ఆందోళన అవసరం లేదన్నారు. ఊరంతా బ్లీచింగ్ పౌడర్ చల్లి, పరిశుభ్రంగా ఉంచారు.

ఇదిలాఉంటే, మహబూబాబాద్ జిల్లా గార్లలో ఓ ఫంక్షన్‌కి వెళ్లి వచ్చాక చిన్నారికి ఇన్ఫెక్షన్ సోకిందని బంధువులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో గార్ల మీద కూడా ఫోకస్ పడింది. అక్కడి వైద్యాధికారుల్లో కదలిక వచ్చినట్టు తెలుస్తోంది. కానీ, ఆస్పత్రుల్లో ఇటువంటి కేసు ఏదీ నమోదు కాకపోవడంతో ప్రస్తుతానికి స్తబ్దుగా ఉంది గార్ల గ్రామం.

ఇటీవలే ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలోని జగ్గయ్యపేట, వత్సవాయి చుట్టుపక్కల ప్రాంతాల్లో డయేరియా కలకలం రేపింది. గత నెలలో గుంటూరు జిల్లా తురకపాలెంలోనూ అంతుబట్టని కారణాలతో 40 మంది చనిపోవడం సంచలనం సృష్టించింది. మెలియాయిడోసిస్‌ వ్యాధిగా నిర్ధారించినప్పటికీ ఇప్పటికీ అది మిస్టరీగానే ఉంది. ఇప్పుడు పెనుగంచిప్రోలులో చిన్నారికి ఒంటి మీద బొబ్బలు రావడంతో ఆందోళన మొదలైంది. సరిహద్దులకు దగ్గరగా ఉండే జిల్లాల్లోనే వింత వ్యాధుల వార్తలు రావడం.. రెండురాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us