Andhra Pradesh: వామ్మో! క్రేన్ తెస్తే కానీ పనవ్వలేదు.. వలకు చిక్కిన 750 కేజీల భారీ టేకు చేప

|

Dec 27, 2021 | 7:20 AM

ఆ చేపను ఎత్తాలంటే క్రేన్ కావాలి. దాన్ని మార్కెట్‌కు తరలించాలంటే పెద్ద వ్యాన్ కావాలి. ఎక్కడది? ఏంటి ఆ చేప కథ?

Andhra Pradesh: వామ్మో! క్రేన్ తెస్తే కానీ పనవ్వలేదు.. వలకు చిక్కిన 750 కేజీల భారీ టేకు చేప
Teku Fish
Follow us on

తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది మినీ హార్బర్‌లో 750 కేజీల బరువుండే టేకు చేప ఉప్పాడ మత్స్యకారులకు వలకు చిక్కింది. దానిని క్రైన్ సహకారంతో బోటు నుండి మినీ వాన్ పైకి ఎక్కించి కాకినాడ మార్కెట్టుకు తరలించారు. ఇంత పెద్ద చేపను చూడడానికి చుట్టుపక్కల జనాలు పోటెత్తారు. ఇంత పెద్ద చేపను చూడడం ఇదే ప్రథమం అని స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. సాధారణంగా మత్స్యకారులు చిన్న చిన్న వలలు వేసి చేపలు పడుతుంటారు. సముద్రంలో వేటకు పెద్ద వలలు ఊపయోగిస్తుంటారు. అయితే పెద్ద వలకు చిక్కిన ఈ చేపను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. అసలు ఇది చేపయేనా అన్నట్లు పరిశీలిస్తూ.. చివరకు కన్‌ఫామ్ చేశారు. ఎలాగోలా ఒడ్డుకు చేర్చిన మత్స్యకారులు.. మార్కెట్‌కు తరలించడానికి పెద్ద సాహసమే చేయాల్సి వచ్చింది.

ఒకటి, రెండు కాదు ఏకంగా 750 కేజీలు. సముద్రం నుంచి మార్కెట్‌కు తరలించడానికి క్రేన్లు ఉపయోగించాల్సి వచ్చింది. ఈ తంతునంతా అక్కడి జనలంతా ఆశ్చర్యంగా చూశారు. మనుషులు ఎత్తడానికి అవకాశమే లేదు, అందుకే క్రేన్ ఉపయోగించారు. ట్రక్కులో తరలించడం కూడా కష్టంగానే మారింది. సముద్రంలో కొన్ని సందర్భాల్లో అరుదైన ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. 750 కిలోల టేకు చేప మత్స్యకారుల వలకు చిక్కడంతో వారంతా ఉబ్బితబ్బిబ్బయిపోయారు.

Also Read: చిరకట్టులో చామంతి.. ఓణీలో పూబంతి..’పదహారణాల తెలుగమ్మాయి’ ఈ హీరోయిన్.. గుర్తుపట్టారా..?

ఈ ఏడాది ట్రాఫిక్‌ చలనాల రూపంలో సర్కారీ ఖజానాకు ఎంత ఆదాయం వచ్చిందో తెలిస్తే మతి పోతుంది..