AP News: అద్దెకొచ్చి ఎంత పని చేశారురా.. చివరికి సీన్ సితారయ్యింది.!

| Edited By: Ravi Kiran

Dec 14, 2024 | 12:40 PM

శ్రీకాకుళం జిల్లాలో నకిలీ కరెన్సీ నోట్లు కలకలం రేపాయి.జిల్లాలో రెండు వేరువేరు ఘటనలలో రూ.72.25 లక్షల దొంగ నోట్లను పోలిసులు పట్టుకున్నారు. మెళియాపుట్టి మండలం పట్టుపురంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని..

AP News: అద్దెకొచ్చి ఎంత పని చేశారురా.. చివరికి సీన్ సితారయ్యింది.!
Representative Image
Follow us on

శ్రీకాకుళం జిల్లాలో నకిలీ కరెన్సీ చెలామణి చేసే ముఠాల గుట్టును రట్టు చేశారు పోలిసులు. రెండు వేరువేరు ఘటనలలో భారీగా దొంగ నోట్లను పట్టుకున్నారు. జిల్లాలోని మెలియాపుట్టి, జి.సిగడాం పోలీస్ స్టేషన్లు పరిధిలో మొత్తం రూ. 72.25 లక్షల నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు ఘటనలకు సంబంధించి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. కేవలం నకిలీ కరెన్సీ చలామణియే కాకుండా వాటి ముద్రణకు కూడా తెరలేపారు దుండగలు. జిల్లాలోని మెళియాపుట్టి మండలం పట్టుపురం గ్రామంలో ఓ ఇల్లును అద్దెకు తీసుకుని ఇంటిలో నకిలీ కరెన్సీ నోట్లు తయారికి పూనుకున్నారు.

మొదట మెళియాపుట్టి ఎస్‌ఐ నకిలీ కరెన్సీకి సంబంధించి ఉన్న ముందస్తు సమాచారంతో తన సిబ్బందితో పట్టుపురం జంక్షన్ వద్ద సంతలక్ష్మీపురం గ్రామంకి చెందిన ఏ-1 అయిన తమ్మిరెడ్డి రవిని పట్టుకొని విచారించారు. ఆ తర్వాత అతడి దగ్గర ఉన్న నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తమ్మిరెడ్డిని విచారించగా మెలియాపుట్టి, పలాస, వజ్రపుకొత్తూరు మండలాలకు చెందిన ఐదుగురు వ్యక్తులతో కలిసి దొంగనోట్లను ముద్రించారని తేలింది. దీంతో ఆ ఐదుగురిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి రూ. 57.25 లక్షల రూపాయలు నకిలీ కరెన్సీతో పాటు దొంగ నోట్ల తయారీకి ఉపయోగించిన మిషనరీ, ఇతర సామగ్రీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ కరెన్సీ తయారీని నిందితులు యూట్యూబ్ ద్వారా తెలుసుకున్నారు. ముద్దాయిలు రూ. 5 లక్షల నిజమైన కరెన్సీ నోట్లు కి బదులుగా రూ.25 లక్షల నకిలీ కరెన్సీ నోట్లను ఇస్తామని ఎర చూపి మోసగించటం వీరి నైజం. ఒరిస్సా నుండి నకిలీ నోట్లు తెచ్చి వాటిని కలర్ జిరాక్స్ మిషిన్‌లో జిరాక్స్ తీసి ఎదుటి వారిని బురిడీ కొడుతున్నారు ఈ నిందితులు.

ఇక జిల్లాలో మరో ఘటనకు సంభందించి జి. సిగడాం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు రూ. 15లక్షల నకిలీ కరెన్సీతో పట్టుబడ్డారు. జి. సిగడాం SI మధు …పెనసాo జంక్షన్ వద్ద ముందస్తు సమాచారంతో తనిఖీ నిర్వహించగాచగా పల్సర్ బైక్ పై వెళుతోన్న ఇద్దరు వ్యక్తులు తారసపడ్డారు. వారి వద్ద నుండి 15 లక్షల రూపాయలు అనగా 500 రూపాయలు 30 కట్లు మరియు మూడు కట్ల బ్లాక్ మనీ అందులో దొరికాయి.ఆ కేసులో కొత్తదిబ్బలపాలెం గ్రామం, ఎచ్చెర్ల మండలంకి చెందిన గనగల్ల రవి A1 కాగా.. A2 – లావేరుకి చెందిన రాజేష్. . తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులను సంపాదించవలని ఉద్దేశంతో దొంగ నోట్లు వ్యాపారం మొదలు పెట్టారు. చివరకు ఇలా కటకటాల పాలయ్యారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..