Shocking: అమానవీయ ఘటన.. దుండగుల చేతిలో 70 కుక్కలు మృతి.. అసలేం జరిగిందంటే.!

Dogs Mass Killing: అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. రాత్రి బాగా పొద్దుపోయిన...

Shocking: అమానవీయ ఘటన.. దుండగుల చేతిలో 70 కుక్కలు మృతి.. అసలేం జరిగిందంటే.!

Updated on: May 03, 2021 | 5:18 PM

Dogs Mass Killing: అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత గుత్తి మండంలం దర్మాపురం గ్రామ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు దారుణానికి పాల్పడ్డారు. నమ్మకానికి విశ్వాసానికి మారుపేరైన కుక్కలను దారుణంగా కొట్టి చంపారు. దాదాపు 200 కుక్కలను ఒక ట్రాక్టర్ లో వేసుకొచ్చిన కొంతమంది కిరాతకులు వాటిని కిందవేసి కొట్టి ప్రాణాలు తీశారు.

అంతలోనే గ్రామస్తుల అలజడి వినిపించింది. గ్రామస్తుల రాకను గమనించిన దుండగులు.. మిగిలిన కుక్కలను వదిలి పారిపోయారు. అప్పటికే దాదాపు 70కిపైగా కుక్కలు చచ్చిపడిపోయాయి. మిగిలిన కుక్కలు అక్కడి నుండి చుట్టూ పక్కల ప్రాంతాలకు, మరికొన్ని సమీప గ్రామాల్లోకి పారిపోయాయి.. అయితే ఈ కుక్కలు పిచ్చివా లేక మంచివా తెలియక గ్రామస్తులు కొంత ఆందోళనకు గురయ్యారు. ఉదయన్నే గ్రామస్తులు గుట్టగా ఉన్న కుక్కల మృతదేహాలకు నిప్పంటించి దహన సంస్కారాలు నిర్వహించారు. కాగా, విశ్వాసానికి మారుపేరుగా ఉన్న కుక్కలను అత్యంత పాశవికంగా చంపిన ఆ దుర్మార్గులు ఎవరో కనిపెట్టి వారిని కఠినంగా శిక్షించాలని జంతు ప్రేమికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Also Read: Viral: ఆకలి మీదున్న సింహం వేట.. నోటికి చిక్కిన అడవి దున్న.. గగుర్పొడిచే దృశ్యాలు..