లారీని ఢీకొన్న కారు.. ఐదుగురు మృతి

| Edited By:

Jun 07, 2019 | 9:40 AM

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు అక్కడకక్కడే మృతిచెందగా మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన రేణిగుంట మండలంలోని పూతలపట్టు జాతీయ రహదారిపై గురవరాజుపల్లి వద్ద చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. మృతులంతా గుంటూరు జిల్లా వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదానికి కారు డ్రైవర్ నిద్రమత్తు కారణమని భావిస్తున్నారు. ఈ ప్రమాద […]

లారీని ఢీకొన్న కారు.. ఐదుగురు మృతి
Follow us on

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు అక్కడకక్కడే మృతిచెందగా మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన రేణిగుంట మండలంలోని పూతలపట్టు జాతీయ రహదారిపై గురవరాజుపల్లి వద్ద చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. మృతులంతా గుంటూరు జిల్లా వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదానికి కారు డ్రైవర్ నిద్రమత్తు కారణమని భావిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు.