KA Paul: స్టీల్ ప్లాంట్ కోసం 4000 కోట్లు సిద్ధం.. ఊ అంటే 72 గంటల్లో ఇస్తా.. జనసైనికులు తన పార్టీలో చేరాలని కేఏ పాల్ పిలుపు..

|

May 20, 2023 | 9:54 AM

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఏర్పడిన ఉక్కుఫ్యాక్టరీకి అవసరమైన 4 వేల కోట్ల రూపాయలను తాను సిద్ధంసి చేసినట్లు డాక్టర్ కెఎ పాల్ ప్లాంట్ ప్రకటించారు. ఉక్కు ఫ్యాక్టరీ ప్రయివేట్ పరం కాకుండా కాపాడేందుకు తన వద్ద 4 వేల కోట్లు సిద్ధంగా ఉన్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సాయంత్రం ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ కెఎ పాల్ మాట్లాడుతూ.. విశాఖ […]

KA Paul: స్టీల్ ప్లాంట్ కోసం 4000 కోట్లు సిద్ధం.. ఊ అంటే 72 గంటల్లో ఇస్తా.. జనసైనికులు తన పార్టీలో చేరాలని కేఏ పాల్ పిలుపు..
Ka Paul
Follow us on

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఏర్పడిన ఉక్కుఫ్యాక్టరీకి అవసరమైన 4 వేల కోట్ల రూపాయలను తాను సిద్ధంసి చేసినట్లు డాక్టర్ కెఎ పాల్ ప్లాంట్ ప్రకటించారు. ఉక్కు ఫ్యాక్టరీ ప్రయివేట్ పరం కాకుండా కాపాడేందుకు తన వద్ద 4 వేల కోట్లు సిద్ధంగా ఉన్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సాయంత్రం ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ కెఎ పాల్ మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కావాల్సిన 4 వేల కోట్ల మూలధనాన్ని అమెరికా వెళ్లి సేకరించానని చెప్పారు.

ఉక్కు కర్మాగారాన్ని అమ్ముకోవడానికి వీలు లేదని కేంద్రానికి తెలియజేసే విధంగా ఇప్పటికే తాను సేకరించిన డబ్బుల విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసేందుకు అనుమతిని కోరుతూ ఇప్పటికే ఉత్తరం రాసానని.. జూన్ 4వ తేదీ లోపు కేంద్రానికి సమయం ఇచ్చానని..అప్పటి లోపు అనుమతినివ్వకపోతే.. తాను ఆమరణ నిర్వహణ దీక్ష చేస్తానని కేంద్రానికి హెచ్చరించారు. అంతేకాదు తన ప్రతిపాదనను కేంద్ర ఒప్పుకుంటే.. సానుకూలంగా స్పందిస్తే.. 72 గంటలోపు 4 వేల కోట్ల వైట్ మనీని కేంద్రానికి చెల్లించేందుకు తాను రెడీ అంటూ చెప్పారు.

తాను మాట తప్పితే తన పాస్‌పోర్టును కేంద్రం స్వాధీనం చేసుకోవచ్చునని.. స్టీల్ ప్లాంట్ మూడో దశను 4 వేల కోట్లతో నడపవచ్చన్నారు. తాను చెప్పిన విషయం విశాఖ ఉక్కు కర్మాగారంపై ప్రత్యక్షం, పరోక్షంగా ఆధారపడిన 16,000 కుటుంబాలకు శుభవార్త అని చెప్పారు పాల్. తనతో పాటు కార్మికులు ఎందుకు రాలేదో తనకు తెలియదన్నారు. ఉక్కు ఫ్యాక్టరీలో ఏదో పెద్ద కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. మరోసారి ప్రయత్నించి ప్రధాని మోదీని కార్మికులతో కలిసి వెళ్లి కలవనున్నామని.. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తానని వెల్లడించారు. బీజేపీ అవినీతి చేస్తుంటే ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు  ప్రశ్నించలేకపోతున్నారని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో రెండు కులాల ఆధిపత్యాన్ని అరికట్టేందుకు జనసైనికులు తనతో కలిసి రావాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు. వాలంటీర్లకు ఇచ్చే నెల జీతం రూ.5000తో ఏమి తినాలని.. తాను అధికారంలోకి వస్తే.. వారి ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తానని హామీనిచ్చారు. జేడీ లక్ష్మీనారాయణ బాటలో జనసైనికులు ప్రజాశాంతి పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు కేఏ పాల్..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..