AP News: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు పిల్లలతో సహా భార్యభర్తలు దుర్మరణం

| Edited By: Ravi Kiran

May 26, 2022 | 1:17 PM

మృతుల్లో భార్య భర్తలతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

AP News: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు పిల్లలతో సహా భార్యభర్తలు దుర్మరణం
Follow us on

Annamayya District: ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు బోల్తా పడిన ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. మదనపల్లి-పుంగనూరు చిత్తూరు రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం అతివేగంతో ఉన్న కారు కల్వర్టును ఢీకొని.. మదనపల్లి రూరల్ మండలం 150వ మైలు వద్ద బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందారు. మృతుల్లో భార్య భర్తలతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

మృతులు నిమ్మనపల్లి మండలం రెడ్డివారిపల్లికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనతో రెడ్డివారిపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. మృతులు గంగిరెడ్డి, మధులత, కుషితారెడ్డి, దేవాన్ష్‌రెడ్డి గా గుర్తించారు. పలమనేరులో పెళ్లి కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి