P Gannavaram: జంబో ‘పనస’.. వెయిట్ ఎంతో తెలిస్తే షాకవుతారు

|

Jul 29, 2021 | 9:00 AM

సాధారణంగా పనసపండు అయిదు నుండి పది కేజీలు ఉంటుంది. కాస్త ఏపైన చెట్టుకు కాసింది అయితే పదిహేను కిలోల వరకు బరువు ఉంటుంది. అయితే..

P Gannavaram: జంబో పనస.. వెయిట్ ఎంతో తెలిస్తే షాకవుతారు
Huge Jackfruit
Follow us on

సాధారణంగా పనసపండు అయిదు నుండి పది కేజీలు ఉంటుంది. కాస్త ఏపైన చెట్టుకు కాసింది అయితే పదిహేను కిలోల వరకు బరువు ఉంటుంది. అయితే పి.గన్నవరంలో ఒక రైతు పొలంలో చెట్టుకు కాసిన 35 కిలోల భారీ పనపండు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం లంకల గన్నవరంలో 35కిలోల పనసకాయ అందరినీ అబ్బురపరిచింది. గన్నవరం లాకు వద్ద ప్రధాన రహదారి చెంతన ఒక వ్యాపారి ఈ పనసకాయను అమ్మకానికి ఉంచాడు. సాధారణంగా పనసకాయలు ఐదు నుంచి పది కిలోల వరకు బరువు ఉంటాయి. అయితే మొండెపులంక గ్రామానికి చెందిన రైతు వరదారావుకు చెందిన ఒక పనస చెట్టుకు ఆశ్చర్యకరంగా 35 కేజీల కాయ కాసింది. పనస కాయలు కొన్న వ్యాపారి ఈ పెద్దకాయను దాంతోపాటు మిగిలిన కాయలను కొనుగోలు చేసి అమ్మకానికి పెట్టడంతో ఈ కాయను చూసి అందరూ ఆశ్చర్యానికి గురి అయ్యారు. అన్ని కాయలకు మాదిరిగానే దాన్ని కూడా అమ్మకానికి పెట్టినట్టు వ్యాపారి శ్రీనివాసరావు చెప్పారు.  పనసపండు వేసవి సీజన్‌లో ఎక్కువగా లభిస్తుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో ఏడాది పొడవునా పనస పండు ఇన్‌స్టాంట్ ప్యాకేజ్ అందుబాటులో ఉంటుంది. శాకాహారులు మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా ఈ పండును తీసుకుంటారు.

 

 పనస పండు ప్రయోజనాలు…

పనస పండు నేరుగా తినడానికే కాకుండా అనేక రకాల వంటల్లోనూ వినియోగిస్తారన్నది తెలిసిందే. చాలా పోషక విలువలు ఉన్న పనస పండుతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఒక కప్పు కట్  చేసిన పనస పండులో ఉండే పోషక విలువలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కేలరీలు : 155

 కార్బోహైడ్రేట్స్ : 40 గ్రామ్స్

 ఫైబర్ : 3 గ్రామ్స్

 ప్రోటీన్స్ : 3 గ్రామ్స్

పనస  రోగ నిరోధక శక్తిని పెంచి అనారోగ్యం బారిన పడకుండ సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విటమిన్ సి వంటి అనేక పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తుంది.

Also Read: పశ్చిమ గోదావరి జిల్లా విద్యార్థి హత్య కేసులో ఊహించని కోణం.. స్వలింగ సంపర్కమే కారణం

 ‘సీతాకోకచిలక’ హీరో కార్తీక్‌కు తీవ్ర గాయాలు.. వ్యాయామం చేస్తున్న సమయంలో