Andhra Pradesh: వామ్మో రాక్షసగూళ్లు..వాటిలో ఏం దొరికాయో తెలుసా

రుద్రమ కోట లో కనిపించే పెద్ద పెద్ద ఆదిమానవుల సమాధులే ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. 2018 లో పూణే, దక్షిణ కొరియా దేశాలకు చెందిన ప్రొఫెసర్లు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు రుద్రమ కోట లో పరిశోధనలు జరిపి త్రవ్వకాలు నిర్వహించారు. ఈ తవ్వకాల్లో నేటికీ చెక్కుచెదరని భారీ ఆదిమానవుల సమాధులు వెలుగుచూశాయి.

Andhra Pradesh: వామ్మో రాక్షసగూళ్లు..వాటిలో ఏం దొరికాయో తెలుసా
Old Pottery Found In Rudramkota
Follow us

| Edited By: Surya Kala

Updated on: Aug 20, 2023 | 9:03 AM

ఏలూరు న్యూస్, ఆగస్టు 20: మూడువేల సంవత్సరాల కిందటి మానవుడు ఎలా ఉండే వాడు. అతను ఏం ధరించాడు, ఏం పాత్రలు ఉపయోగించాడు. వీటికి సంబంధించిన ఆనవాళ్లు ఏలూరు జిల్లా రుద్రమకోటలో బయట పడ్డాయి. గోదావరి నదికి అతి సమీపంలో ఉన్న ఆ గ్రామంలోని పొలాల్లో పెద్ద పెద్ద బండరాళ్లు కనిపిస్తాయి. వీటిని కేవలం యంత్రాలు సహాయంతో మాత్రమే మనిషి కదిలించగలడు. అయితే ఇవి సహజమైన బండరాళ్లు కాదు. అవి ఆది మానవుడి సమాధులు.

ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం రుద్రంకోటకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. కాకతీయుల కాలం, సింధు నాగరికత కంటే వేల సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతంలో ఆదిమానవులు నివసించినట్లు ఆధారాలు ఉన్నాయి. ప్రపంచంలోనే రుద్రంకోట గ్రామానికి ప్రత్యేక స్థానం ఉన్నట్లు పూణే దక్కన్ కళాశాలకు చెందిన ప్రొఫెసర్లు వెల్లడించారు. రుద్రమ కోట లో కనిపించే పెద్ద పెద్ద ఆదిమానవుల సమాధులే ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. 2018 లో పూణే, దక్షిణ కొరియా దేశాలకు చెందిన ప్రొఫెసర్లు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు రుద్రమ కోట లో పరిశోధనలు జరిపి త్రవ్వకాలు నిర్వహించారు. ఈ తవ్వకాల్లో నేటికీ చెక్కుచెదరని భారీ ఆదిమానవుల సమాధులు వెలుగుచూశాయి. ఆదిమానవుల మనుగడ, జీవనం, సంస్కృతి సాంప్రదాయాలకు ఇవి అద్దం పడుతున్నాయి.

ఈ సమాధుల్లో అడవి జంతువులను వేటాడడానికి ఉపయోగించే కత్తి, ఈటెలను పురావస్తు శాఖ వారు గుర్తించారు. ఈ సమాధులు సుమారు 8 అడుగుల నుంచి 16 అడుగుల మేర ఉన్నాయి. ఆదిమానవులు చనిపోయాక వారి మృతదేహాలను భూమిలో పాతిపెట్టి పైన పెద్ద పెద్ద రాతి బండలతో సమాధులను కట్టినట్లు అర్థమవుతుంది. ఎటువంటి టెక్నాలజీ లేకుండానే ఆదిమానవులు భారీ ఎత్తున అత్యంత భద్రతతో సమాధులు కట్టిన ఆనవాళ్లను పురావస్తు శాఖ గుర్తించారు. రుద్రకోట పరిసర ప్రాంతాల్లో వందల సంఖ్యలో ఆదిమానవుల సమాధులు ఉన్నాయి. సమాధుల్లో ఎంతో విలువైన ఆదిమానవుల సామాగ్రితో పాటు, మహిళలు అలంకారానికి ఉపయోగించిన పూసలు, దండలను తవ్వకాల్లో గుర్తించారు.

ఇవి కూడా చదవండి

ఈ సమాధులను చూడటానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇప్పటికీ వస్తుంటారు. సమాధుల ను చూసి ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ ప్రాంత ప్రజలు ఆదిమానవుల సమాధులను రాక్షస గూళ్ళు గా పిలుస్తుంటారు. పురావస్తు శాఖ వారు జరిపిన తవ్వకాల్లో ఆదిమానవ సమాధులు తో పాటు ఇనప వస్తువులు కూడా లభ్యమయ్యాయి. సమాధుల్లో బయటపడిన వస్తువులను, సామాగ్రిని విజయవాడ మ్యూజియం కు పురావస్తు శాఖ తరలించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..