East Godavari: ఆశ్చర్యం.. ఒక్కో చెట్టుకు మూడొందల కమలా కాయలు..

|

Jan 30, 2022 | 3:25 PM

తూర్పు గోదావరి జిల్లా కడియం ప్రముఖ నర్సరీలో ఓ క్రేజీ సీన్ కనిపించింది. ఆకులు కూడా కనిపించకుండా కాయలతో నిండుగా ఉన్న కమలా మొక్కలు నర్సరీలో సందడి చేస్తున్నాయి.

East Godavari: ఆశ్చర్యం.. ఒక్కో చెట్టుకు మూడొందల కమలా కాయలు..
Mandarin Orange Tree
Follow us on

Mandarin orange plant: తూర్పు గోదావరి జిల్లా కడియంలోని ప్రముఖ నర్సరీ(kadiyam nursery)లో ఓ క్రేజీ సీన్ కనిపించింది. ఆకులు కూడా కనిపించకుండా కాయలతో నిండుగా ఉన్న కమలా మొక్కలు నర్సరీలో సందడి చేస్తున్నాయి. విదేశాల్లోనే ఉండే ఈ మొక్కలు రెండు రోజుల క్రితం ఇక్కడకు చేరుకున్నాయి. చెట్టుపై నుంచి కింద వరకు కాయలతోనే నిండి ఉన్నాయి. రవాణా ఖర్చులు కలిపి ఇక్కడకు రావడానికి ఒక్కొక్క మొక్కకు దాదాపు 20 వేలు ఖర్చు అయిందట. అలాగని వీటిని అమ్మడానికి ప్రత్యేకంగా తీసుకొచ్చింది కాదు. ఈనెల 22వ తేదీ నుంచి మూడు రోజుల పాటు రాజమహేంద్రవరం(Rajamahendravaram) ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జరగాల్సిన నర్సరీ మేళాలో ప్రత్యేక ఆకర్షణంగా ఉండేందుకు ఈ నాలుగు మొక్కలను బుక్ చేసుకున్నారు నర్సరీ యజమాని. అయితే కోవిడ్ కారణంగా అధికారులు అనుమతి ఇవ్వకపొవడంతో నర్సరీ మేళా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అలాగే ఈ మొక్కలు వేరే దేశం నుండి ఓడలో రావడం కూడా జాప్యం జరిగి రెండు రోజుల క్రితమే ఇక్కడకు చేరుకున్నాయి. ఈ అరుదైన మొక్కలు మన దేశానికి రావడం ఇదే ప్రథమమని తెలుస్తుంది. అయితే ఈ మొక్కలు తీసుకొచ్చిన రైతు పేరు చెప్పడానికి ఇష్టపడటం లేదు. అదేమని అడిగితే ఈ కాయలు ఎక్కడో కాచినవని.. వచ్చే సీజన్‌లో తన నర్సరీలో ఇదే విధంగా కాపు కాయించి తన నర్సరీ ప్రత్యేకతను తెలియజేస్తామని ఆ రైతు ధీమా వ్యక్తం చేశారు.

Also Read: ఒంట్లో నలతగా ఉందని.. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఆటోలోనే ప్రసవించిన బాలిక.. ఎంక్వైరీ చేయగా

Kadapa: శ్మశానం దగ్గర్లోని నిర్మానుష్య ప్రాంతం వద్ద కనిపించిన రంధ్రాలు.. దిగి చెక్ చేయగా అద్భుతం