నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మనుబోలు మండలం బద్దెవోలు వద్ద లారీని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మనుబోలు మండలం బద్దెవోలు అడ్డరోడ్డు సమీపంలో అగి ఉన్న లారీని ఇనోవా కారు ఢీ కొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించారు.
క్షతగాత్రులను గూడూరు ఆసుప్రత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కోడవనూరు మండలం దమరిగుంట నుంచి చెన్నైకి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా.. మృతులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..