Rajahmundry East Godavari: తల్లి మరణించిందన్న మనస్థాపంతో ముగ్గురు బలవన్మణానికి పాల్పడ్డారు. రాజమండ్రిలో ఈ నెల 1న లభ్యమైన మూడు మృతదేహాల కేసు మిస్టరీ వీడింది. మృతులు సొంత అక్కాచెల్లెలు, తమ్ముడిగా గుర్తించారు. తమ తల్లి అనారోగ్యంతో మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకు గురైన ముగ్గురు గోదావరిలో దూకి సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు బాపూజీనగర్‌కు చెందిన అక్క మామిడిపల్లి కన్నా దేవి (34) చెల్లెలు నాగమణి (32), తమ్ముడు దుర్గారావు (30) గా పోలీసులు గుర్తించారు.
గత నెల 31న రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఊపిరితిత్తుల వ్యాధితో చికిత్స పొందుతూ మృతుల తల్లి కన్నుమూసింది. అంత్యక్రియల అనంతరం తాము పనులు చూసుకోని వస్తామని.. తండ్రిని ఇంటికి పంపించారు. అనంతరం అక్కాచెల్లెళ్లు, తమ్ముడు ముగ్గురు కూడా గోదావరిలో దూకేశారు. ఈనెల ఒకటిన రాజమండ్రి ఇసుక ర్యాంప్ వద్ద గోదావరిలో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. మూడు రోజులు మార్చురీలో ఉన్న మృతదేహాల వద్దకు ఎవరూ రాకపోవడంతో రాజమండ్రి వన్ టౌన్ పోలీసులు ఖననం చేశారు.
ఆ తర్వాత ఇది తెలుసుకున్న తండ్రి మామిడిపల్లి నరసింహం కన్నీరుమున్నీరవుతున్నారు. కన్నబిడ్డల కడచూపు కూడా దక్కలేదంటూ రోదిస్తున్నారు. భార్య, బిడ్డలు దూరమవడంతో నరసింహాం తల్లడిల్లుతున్నారు. కాగా.. నరసింహం రైల్వే గ్యాంగ్‌మెన్‌గా పనిచేసి 2014లో ఉద్యోగ విరమణ చేశారు. ఈ ఘటనతో బాపూజీ నగర్‌లో విషాదం అలుముకుంది.
Also Read: