Inter Weightage to AP EAPCET: విద్యార్ధులకు అలర్ట్.. ఈఏపీసెట్‌-2023లో ఇంటర్‌ వెయిటేజీ తప్పనిసరి..!

|

Apr 21, 2023 | 2:54 PM

ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీసెట్‌-2023కి 25 శాతం ఇంటర్‌ మార్కుల వెయిటేజీ తప్పనిసరి చేస్తూ ఉన్నత విద్యామండలి ప్రకటన విడుదల చేసింది. ఇంజినీరింగ్‌, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్‌లో ఈ ఏడాది కూడా ఇంటర్మీడియట్‌ మార్కులకు వెయిటేజీ కొనసాగిస్తున్నట్లు..

Inter Weightage to AP EAPCET: విద్యార్ధులకు అలర్ట్.. ఈఏపీసెట్‌-2023లో ఇంటర్‌ వెయిటేజీ తప్పనిసరి..!
AP EAPCET-2023
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీసెట్‌-2023కి 25 శాతం ఇంటర్‌ మార్కుల వెయిటేజీ తప్పనిసరి చేస్తూ ఉన్నత విద్యామండలి ప్రకటన విడుదల చేసింది. ఇంజినీరింగ్‌, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్‌లో ఈ ఏడాది కూడా ఇంటర్మీడియట్‌ మార్కులకు వెయిటేజీ కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది.

కాగా గతంలో కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించకపోవడంతో వెయిటేజీ తొలగించారు. ఈ ఏడాది ఇంటర్‌ మార్కులు 25 శాతం వెయిటేజీని పునరుద్ధరించారు. ఈఏపీసెట్‌లో వచ్చే మార్కులు 75 శాతం, ఇంటర్మీడియట్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకులు కేటాయించనున్నారు. ఇంటర్మీడియట్‌లో ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు వస్తే సరిపోతుంది.

ఇక ఈ ఏడాది ఈఏపీసెట్‌-2023కు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 15వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 15 నాటికి దాదాపు 3,26,315 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నట్లు కన్వీనర్‌ ఆచార్య శోభాబిందు తెలిపారు. రూ.500, రూ.1000, రూ.10వేల ఆలస్య రుసుముతో మే 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక పరీక్ష మే 15 నుంచి 22 వరకు జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.