Andhra Pradesh: కొట్టంలో అర్ధరాత్రి పశువులు అరుపులు.. చూసేందుకు వెళ్లగా..
విధి మనుషులు జీవితాలతో ఎప్పుడు ఎలా ఆడుకుంటుందో చెప్పలేం. తాజాగా అనంతపురం జిల్లాలో విషాద ఘటన వెలుగుచూసింది.
Anantapur: ఏపీలోని అనంతపురం జిల్లాలో విషాద ఘటన వెలుగుచూసింది. ఇద్దరు అన్నదమ్ములను వెంటవెంటనే చావు వెంటాడింది. కరెంట్ షాక్‌తో అన్నదమ్ములు లోకాన్ని వీడారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని డి.హారేహాల్(D Hirehal) మండలం చెర్లోపల్లి గ్రామంలో రామచంద్ర (45), గంగన్న (43) అనే పేర్లు గల ఇద్దరు అన్నదమ్ములు నివాసం ఉంటున్నారు. వీరికి వ్యవసాయమే జీవనాధారం. పొద్దున్నే పొలానికి వెళ్లి సాయంత్రం పొద్దుపొయ్యాక ఇంటికి వచ్చేవారు. కాగా శనివారం రోజున అర్ధరాత్రి తమ పశువుల కొట్టంలో ఎద్దులు అరుస్తుండడంతో.. పాములు గానీ వచ్చాయేమో అని రామచంద్ర చూసేందుకు వెళ్లాడు. అయితే పాకకు ఉన్న ఇనుప రేకులకు కరెంట్ సరఫరా అయింది. ఈ రేకులను పట్టుకోగానే విద్యుదాఘాతంతో రామచంద్ర స్పాట్‌లో మృతి చెందాడు. అన్న ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో… కంగారుపడ్డ తమ్ముడు గంగన్న పశువుల కొట్టం వద్దకు వెళ్లాడు. అతను కూడా కరెంట్ షాక్‌కు గురై మృతిచెందాడు. విషయం తెలుకున్న స్థానికులు.. పవర్ సప్లై నిలిపివేయించారు. అనంతరం పాకలోని పశువులను బయటకు తీసుకువచ్చారు. ఒకేసారి అన్నదమ్ములు మృతిచెందడంతో.. ఆ కుటుంబంతో పాటు చెర్లోపల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
Also Read: Viral: వ్యక్తి చనిపోయాడని కన్ఫామ్ చేసిన డాక్టర్లు.. అంత్యక్రియలకు ముందు స్నానం చేయిస్తుండగా షాక్!