Viral: వ్యక్తి చనిపోయాడని కన్ఫామ్ చేసిన డాక్టర్లు.. అంత్యక్రియలకు ముందు స్నానం చేయిస్తుండగా షాక్!

రోగి చనిపోయాడని కన్ఫామ్ చేశారు డాక్టర్లు. వెంటిలేటర్​ను తొలగించి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించేశాడు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా ఊహించని ఇన్సిడెంట్ చోటుచేసుకుంది.

Viral: వ్యక్తి చనిపోయాడని కన్ఫామ్ చేసిన డాక్టర్లు.. అంత్యక్రియలకు ముందు స్నానం చేయిస్తుండగా షాక్!
Uttarakhand News
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 10, 2022 | 1:56 PM

Uttarakhand: ఉత్తరాఖండ్​లో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. ప్రైవేట్​ ఆసుపత్రి నిర్లక్ష్య ధోరణి బయటపడింది. రోగి బతికుండగానే చనిపోయాడని డాక్టర్లు కన్ఫామ్ చేశారు. కరణ్​పుర్​కు చెందిన అజాబ్​ సింగ్(60) అనే రోగికి బీపీ డౌన్ అవ్వడం వల్ల లక్సర్​లోని హిమాలయన్​ హాస్పిటల్‌లో  చేర్పించారు ఫ్యామిలీ మెంబర్స్. వెంటనే అడ్మిట్ చేసుకున్న డాక్టర్లు.. ఎమర్జెన్సీ వార్డులో ఉంచి.. 4 రోజుల పాటు వెంటిలేటర్​ పెట్టి చికిత్స అందించారు. శుక్రవారం.. అజాబ్ సింగ్ మరణించారని చెప్పి.. వెంటిలేటర్​ను తీసేశారు. ద బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చామని.. అయినా రోగి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదని కుటుంబసభ్యులకు డాక్టర్లు తెలిపారు. నాలుగు రోజులు ట్రీట్మెంట్ ఖర్చులకుగానూ రోగి కుటుంబం నుంచి రూ.1,70,000 రూపాయలు వసూలు చేసింది ఆసుపత్రి యజమాన్యం. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఇక వృద్ధుడికి పెట్టిన వెంటిలేటర్​ను తొలగించి కుటుంబ సభ్యులకు అప్పగించేశారు. దీంతో తీవ్ర ఆవేదనతో, బాధతో వృద్ధుడి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అంత్యక్రియలకి ముందు వృద్ధునికి స్నానం చేయిస్తుండగా అతడు కదలడం, శ్వాస తీసుకోవడం ఫ్యామిలీ  మెంబర్స్ గమనించారు. వెంటనే లక్సర్​లోని మరో ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ చేయించారు. మొదట చికిత్స చేసిన ఆసుపత్రి నిర్వాకంపై ప్రభుత్వ ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.

Also Read:  Watch Video: అతివేగం ఎంత ప్రమాదో చెప్పే రోడ్ యాక్సిడెంట్ ఇది.. క్షణ కాలంలో