Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: వారసులొచ్చారు.. వైసీపీ సెకండ్‌ లిస్ట్‌లో 16 కొత్త ముఖాలు.. లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారో తెలుసా..?

సామాజిక సమీకరణాలే లక్ష్యంగా జాబితా రూపకల్పన జరిగినట్లు స్పష్టమవుతోంది. తాజా జాబితాలో పలువురికి స్థానచలనం జరిగింది. అలాగే.. వారసులకు ఇన్‌ఛార్జిల పోస్టులు దక్కాయి. ఇదీ ఓవరాల్‌గా వైసీపీ సెకండ్‌ లిస్ట్‌ సారాంశం!. రెండో జాబితాలో 27 నియోజకవర్గాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌లను ప్రకటిస్తే అందులో 16 కొత్త ముఖాలు కనిపించాయ్‌..

Andhra Pradesh: వారసులొచ్చారు.. వైసీపీ సెకండ్‌ లిస్ట్‌లో 16 కొత్త ముఖాలు.. లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారో తెలుసా..?
AP CM YS Jagan
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 03, 2024 | 10:46 AM

సామాజిక సమీకరణాలే లక్ష్యంగా జాబితా రూపకల్పన జరిగినట్లు స్పష్టమవుతోంది. తాజా జాబితాలో పలువురికి స్థానచలనం జరిగింది. అలాగే.. వారసులకు ఇన్‌ఛార్జిల పోస్టులు దక్కాయి. ఇదీ ఓవరాల్‌గా వైసీపీ సెకండ్‌ లిస్ట్‌ సారాంశం!. రెండో జాబితాలో 27 నియోజకవర్గాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌లను ప్రకటిస్తే అందులో 16 కొత్త ముఖాలు కనిపించాయ్‌!. వీళ్లల్లో ఐదారుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేల వారసులు ఉన్నారు. తిరుపతి సిట్టింగ్‌ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి స్థానంలో అతని కుమారుడు అభినయ్‌రెడ్డిని ఇన్‌ఛార్జ్‌గా ప్రకటించింది. అలాగే, చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్థానంలో ఆయన కుమారుడు మోహిత్‌రెడ్డికి, గుంటూరు ఈస్ట్‌లో షేక్ ముస్తఫా ప్లేస్‌లో అతని కుమార్తె షేక్‌ నూరి ఫాతిమాకు, మచిలీపట్నంలో పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి అలియాస్‌ కిట్టుకి, రామచంద్రపురంలో పిల్లి సుభాష్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్‌కు, పోలవరంలో తెల్లం బాలరాజుకు బదులుగా అతని భార్య తెల్లం రాజ్యలక్ష్మికి ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు అప్పగించింది వైసీపీ.

ఈ ఆరుగురే కాకుండా మరో పది మంది కొత్తవాళ్లు ఉన్నారు. హిందూపురం పార్లమెంట్‌ స్థానానికి జె.శాంతను ఇన్‌ఛార్జ్‌గా ప్రకటించారు. అలాగే, రాజాం, అనకాపల్లి, పి.గన్నవరం, జగ్గంపేట, కదిరి, యర్రగొండపాలెం, ఎమ్మిగనూరు, పాడేరు, విజయవాడ వెస్ట్‌ నియోజకవర్గాల్లో కొత్త ముఖాలను తెరపైకి తెచ్చింది వైసీపీ.

వారసులు..

తిరుపతి – భూమన అభినయ్‌రెడ్డి (భూమన కరుణాకర్‌రెడ్డి కుమారుడు)

చంద్రగిరి – చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి (చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు)

గుంటూరు ఈస్ట్‌ – షేక్‌ నూరి ఫాతిమా (షేక్ ముస్తఫా కూతురు)

మచిలీపట్నం – పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) (పేర్ని నాని కుమారుడు)

రామచంద్రపురం – పిల్లి సూర్యప్రకాష్‌ (పిల్లి సుభాష్ కుమారుడు)

పోలవరం – తెల్లం రాజ్యలక్ష్మి (తెల్లం బాలరాజు సతీమణి)

కొత్త ముఖాలు

  • జె.శాంత – హిందూపురం పార్లమెంట్‌
  • తాలె రాజేష్ – రాజాం
  • మలసాల భరత్‌ – అనకాపల్లి
  • విప్పర్తి వేణుగోపాల్ – పి.గన్నవరం
  • తోట నరసింహం – జగ్గంపేట
  • మక్బూల్ అహ్మద్‌ – కదిరి
  • తాటిపర్తి చంద్రశేఖర్ – యర్రగొండపాలెం
  • మాచాని వెంకటేష్ – ఎమ్మిగనూరు
  • ఎం.విశ్వేశ్వరరాజు – పాడేరు
  • షేక్ ఆసిఫ్ – విజయవాడ వెస్ట్‌

175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ఇన్‌ఛార్జ్‌ల నియామకం జరుగుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రజాదరణ, సమర్థత, వైసీపీ నాయకత్వంపై ఉండే నమ్మకం.. ఇవన్నీ చూశాకే ఎంపిక చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు

సెకండ్‌ లిస్ట్‌ను గమనిస్తే, అత్యధికంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 7చోట్ల మార్పులు జరిగాయ్‌. ఆ తర్వాత ఉమ్మడి విశాఖ, అనంతపురం జిల్లాల్లో ఐదేసి చొప్పున ఛేంజెస్‌ చేసింది వైసీపీ. ఇక, ఉమ్మడి కృష్ణాజిల్లాలో మూడు చోట్ల, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు చోట్ల మార్పులు జరిగాయ్‌. అలాగే, శ్రీకాళం, ప్రకాశం, కర్నూలు, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఇన్‌ఛార్జ్‌లను మార్చింది.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..