Andhra: హైవేపై దూసుకొచ్చిన డీసీఎం వ్యాన్.. పోలీసులను చూసి ఒక్కసారిగా బ్రేకులు.. కట్ చేస్తే

హైవేపై దూసుకుతున్న లారీ.. సడన్‌గా పోలీసులను చూసి ఆగింది. అనుమానమొచ్చి దాన్ని పూర్తిగా చెక్ చేయగా.. దెబ్బకు షాక్ అయ్యారు. అందులో ఉన్నది చూసి నిర్ఘాంతపోయారు పోలీసులు. ఇంతకీ అందులో ఏముందంటే.? ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి మీరూ లుక్కేయండి.

Andhra: హైవేపై దూసుకొచ్చిన డీసీఎం వ్యాన్.. పోలీసులను చూసి ఒక్కసారిగా బ్రేకులు.. కట్ చేస్తే
Trending Updates

Edited By: Ravi Kiran

Updated on: Oct 01, 2025 | 3:43 PM

ఏపీలో గంజాయిను ఎన్ని రకాలుగా కట్టడి చేసినా కేటుగాళ్లు మాత్రం రూట్ మార్చి తరలిస్తున్నారు. ఈగల్ టాస్క్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్ పోలీసులు గంజాయి రవాణాపై ఉక్కు పాదం మోపుతున్నా కొందరు అక్రమార్కులు రూట్ మార్చి అధికారులను ఏమార్చి రవాణా చేస్తున్నారు. తాజాగా విజయవాడలో రెండు కోట్ల విలువ చేసే గంజాయి రవాణాకి చెక్ పెట్టారు DRI అధికారులు.

ఇది చదవండి: దండిగా చేపలు పడదామని బోట్‌లో వెళ్లాడు.. నీటి అడుగున కనిపించింది చూడగా

ఛత్తీస్గఢ్ నుంచి తమిళనాడులోని సేలంకు తరలిస్తున్న రెండున్నర కోట్ల విలువైన గంజాయిను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. విజయవాడ రామవరప్పాడులో పక్కా సమాచారంతో 1,300 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న డీఆర్‌ఐ అధికారులు సుక్మా నుంచి తమిళనాడు మీదుగా సేలంకు తరలిస్తున్నట్లు గుర్తించారు. మూడు రాష్ట్రాల పోలీసులు కళ్లుగప్పి రాష్ట్రాల సరిహద్దులు దాటి మరి గూడ్స్‌ తరలించే డీసీఎం వాహనంలో ఎవరికి అనుమానం రాకుండా గంజాయిను తరలిస్తున్నారు. పైపులు, ఇతర సామగ్రి మధ్యలో 561 ప్యాకెట్లుగా చేసి వాటిని తరలిస్తున్నట్లు గుర్తించారు. గంజాయి తరలిస్తున్న వెంకటేష్, మురుగేషన్ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: అక్కడెలా పెట్టుకున్నావురా.. 10 ఏళ్ల బాలుడికి ఎక్స్‌రే తీసి బిత్తరపోయిన డాక్టర్లు