Sompeta: అర్ధరాత్రి వేళ ఇంటి ముందు నుంచి విచిత్ర చప్పుళ్లు.. ఏంటా అని వెళ్లి చూడగా గుండెలు గుభేల్

|

Apr 09, 2023 | 12:26 PM

ప్రజంట్ సమ్మర్ సీజన్ నడుస్తుంది. వేసవి తాపంతో లేదా దాహం వేసి వన్యప్రాణులు, పాములు జనావాసాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ ఇలాంటి జీవులు ఏవైనా కనిపించినా.. చంపకుండా.. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి.

Sompeta: అర్ధరాత్రి వేళ ఇంటి ముందు నుంచి విచిత్ర చప్పుళ్లు.. ఏంటా అని వెళ్లి చూడగా గుండెలు గుభేల్
Huge King Cobra
Follow us on

అసలే ఎండాకాలం.. రాత్రి సమయం.. బయట నుంచి చిక్కటి గాలి వస్తుంటే.. అందరూ సోయి లేకుండా పడుకున్నారు. బాగా మొద్దు నిద్రలో ఉండగా.. బయట నుంచి విచిత్ర చప్పుళ్లు వచ్చాయి. దీంతో ఆ ఇంట్లోని వ్యక్తి  వాకిలి వద్ద వెళ్లి చూసి.. కంగుతిన్నాడు. వెంటనే పెద్దగా కేకలు వేశాడు. అక్కడ కనిపించింది పెద్ద పాము. అది కూడా అలాంటి.. ఇలాంటి పాము కాదు.. డేంజరస్ కింగ్ కోబ్రా.

వివరాల్లోకి వెళ్తే..  శ్రీకాకుళం జిల్లా సోంపేటలో ఓ భారీ కింగ్ కోబ్రా మిడ్ నైట్ వేళ కలకలం రేపింది. సోంపేటలోని జింకిభద్ర కాలనీలో ఓ ఇంటి ముందు 12 అడుగుల కింగ్‌కోబ్రా పాము హల్ చల్ చేసింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఇంటి ముందు పెద్ద శబ్దం రావడంతో లోపల ఉన్నవాళ్లు బయటకు వచ్చి చూసేసరికి భారీ పాము కనిపించింది. దాన్ని చూసి భయాందోళనలకు గురయిన స్థానికులు వెంటనే సోంపేటకు చెందిన స్నేక్ క్యాచర్ బాలయ్యకు సమాచారమిచ్చారు. బాలయ్య వచ్చి చాకచక్యంగా పామును బంధించారు. దాంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అది 12 అడుగుల పొడవు, 10 కిలోల బరువు ఉందని బాలయ్య తెలిపారు. ఆ పామును ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులకు అప్పగించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..