Oxygen Shortage: తిరుపతిలో ఘోరం.. ఆక్సిజన్ అందక 11 మంది కరోనా బాధితులు మృతి

|

May 11, 2021 | 6:42 AM

Tirupati Ruia Hospital: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో విషాదం నెలకొంది. నగరంలోని రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడి

Oxygen Shortage: తిరుపతిలో ఘోరం.. ఆక్సిజన్ అందక 11 మంది కరోనా బాధితులు మృతి
Tirupati Ruya Hospital
Follow us on

Tirupati Ruia Hospital: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో విషాదం నెలకొంది. నగరంలోని రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడి 11 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ్‌ సోమవారం రాత్రి వెల్లడించారు. చెన్నై నుంచి రావాల్సిన ట్యాంకర్‌ ఐదు నిమిషాలు ఆలస్యం కావడంతో ఈ ఘోరం జరిగినట్లు ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. అయితే.. వెంటిలేటర్‌పై ఉన్న బాధితులు మాత్రమే చనిపోయారని మిగతా వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని కలెక్టర్‌ వెల్లడించారు. మిగతా రోగుల పరిస్థితిని డాక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని తెలిపారు.

ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోగానే ఆసుపత్రిలో తొలుత ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అప్రమత్తమైన వైద్యులు సీపీఆర్‌ విధానంలో శ్వాస అందించారు. బాధితుల బంధువులు పక్కనే ఉండి అట్టముక్కలు, తదితర వాటితో గాలిని అందించేందుకు ప్రయత్నాలు చేశారు. ఆక్సిజన్ ట్యాంకర్‌ రాగానే సాంకేతిక నిపుణులు వెంటనే స్పందించి సరఫరాను వేగంగా పునరుద్ధరించారు. ఇదిలాఉంటే.. ఈ ఘటనపై ఏపీ హోంమంత్రి సుచరిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనికి కాణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.

ఈ ఘటనపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ఆక్సిజన్‌ అందక 11 మంది చనిపోయిన ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని వెల్లడించారు. అలాగే టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సైతం ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇదిలాఉంటే.. దేశంలోని ప్రాంతాల్లో ఇటీవల కాలంలో ఆక్సిజన్ కొరతతో వందల సంఖ్య ప్రాణాలు కోల్పుతున్న విషయం తెలిసిందే.

Also Read:

Corona Vaccine: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాక్సిన్ వివాదం..స్పందించిన ప్రభుత్వం..రాష్ట్రానికి వచ్చిన టీకాల లెక్కలు ఇవే!

Lock Down In India: భార‌త్‌లో ప‌రిస్థితులు అదుపులోకి రావాలంటే లాక్‌డౌన్ పెట్టాల్సిందే: అమెరికా చీఫ్ మెడికల్ అడ్వైజర్..